లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ చెవులు ఎందుకు కోశాడు?
TeluguStop.com
రావణాసురిడి సోదరి అయిన శూర్పణఖ గురించి అందరికీ తెలిసిన విషయమే.ఆమె రాక్షసనే విషయం కూడా అందరికీ విధితమే.
అంతే కాదండోయ్ లక్ష్మణుడు ఆమె ముక్కూ, చెవులు కోసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
అయితే లక్ష్మణుడు ఎందుకు ఆమె ముక్కూ, చెవులు ఎందుకు కోశాడో మాత్రం తెలియదు.ఇప్పుడు ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం.
శూర్ఫణఖ భర్తను తన సొంత అన్న రావణాసురుడే చంపాడు.ఆ తర్వాత అన్న మీద ప్రేమతో అతడిని ఏమీ అనలేక.
భర్త చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక అడవుల్లో తిరుగుతుంటుంది.అలా అడవుల్లో తిరుగుతుండగానే.
పంచవటి అనే అడవిలో శూర్ఫణఖ శ్రీరామ చంద్రుడిని చూస్తుంది.చూసిన మొదటి చూపులోనే అతడినే మోహించి పెళ్లి చేసుకోమని అడుగుతుంది.
అందుకు శ్రీరామ చంద్రుడు ఒప్పుకోకుండా.తాను ఏకపత్రీ వ్రతుడినని, సీతా దేవిని తప్ప మరొకరిని ఆ దృష్టితో చూడలేనని చెప్తాడు.
శూర్పణఖను వెళ్లి తన తమ్ముడు లక్ష్మణుడిని కలవమని చెప్తాడు.రాముడి గురించి పూర్తిగా తెలిసిన లక్ష్మణుడు.
శూర్ఫణఖను ఆట పట్టించాలనుకుంటాడు. """/" /
తాను రాముడి సేవకుడినని.
రాముడికి రెండో భార్యగా ఉండటం మంచిదని సూచిస్తాడు.ఆ మాటలకు కోపోద్రిక్తురాలైన శూర్ఫణఖ శ్రీరామ చంద్రుడి భార్య సీతా దేవి గురించి అసభ్యకరంగా మాట్లాడుతుంది.
తల్లిలాంటి తన వదినను అలా తిట్టడం జీర్ణించుకోలేని లక్ష్మణుడు శూర్ఫణఖ ముక్కూ, చెవులు కోసేస్తాడు.
లక్ష్మణుడి చేతిలో తీవ్ర పరాభవం చెందిన శూర్ఫణఖ అది తట్టుకోలేక తన అన్నరావణాసురుడి వద్దకు చేరుతుంది.
శ్రీరాముడు, సీతా దేవి గురించి నూరిపోస్తుంది.అందువల్లే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొస్తాడు.
వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!