హీరో రాజా ఎందుకు అలా మారిపోయాడు..?
TeluguStop.com
రాజా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలు చేసినప్పటికీ ఆయన చేసిన ఆనంద్( Anand ) సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు రాజా.
ఆయన ఆ సినిమా తరువాత మంచి సినిమాల్లో చేస్తూ యూత్ లోమంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాల్ని అందుకున్నాయి.
ఆయన ప్రస్తుతం క్రిస్టియానిటీ గొప్పతనం గురించి జనాలకి తెలియజేసి ప్రాసెస్ లో ఉన్నారు.
దేవాకట్టా గారి డైరెక్షన్ లో ఆయన చేసిన వెన్నెల సినిమా( Vennela ) ఇండస్ట్రీ లో మంచి హిట్ గా నిలిచింది అలాగే ఆయన కూడా ఆ సినిమాతో ఇండస్ట్రీ లో ఇంకో మెట్టు పైకి ఎక్కారనే చెప్పాలి.
"""/" /
అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తో నటించడం నా కల అని చెప్పారు అలా వాళ్ళిద్దరితో కలిసి నటించే అవకాశం ఆయనకి చాలా తొందర్లోనే వచ్చింది.
కొద్దిరోజులు గడిచాక ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అవడం తో ఆయనకి అవకాశాలు చాలా తగ్గాయి అలా అవకాశాలు తగ్గడం తో ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు, అలాగే మహేష్ బాబు హీరో గా వచ్చిన అర్జున్ సినిమాలో మహేష్ బాబు బావ గా నటించాడు.
"""/" /
ఈ సినిమాలు రెండు కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు, దాంతో ఆయనకి ఆ రెండు సినిమాలు పెద్దగా ప్లస్ అవ్వలేదు అనే చెప్పాలి.
కానీ వాళ్ళిద్దరితో నటించాలి అని ఆయనకి ఉన్న కల మాత్రం నెరవేరిందని చెప్పాలి.
అయితే ఇండస్ట్రీ నుంచి సడన్ గా అలా దైవత్వం వైపు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఆయనకి ఎందుకో నచ్చలేదట, అందుకే ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు.
దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?