Delhi Liquor Scam Case : ఆధారాలుంటే కస్టడీకి ఎందుకు..?: కేజ్రీవాల్ న్యాయవాది సింఘ్వీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ( CM Arvind Kejriwal ) అదుపులోకి తీసుకున్న ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.కాగా కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ( Lawyer Abhishek Manu Singhvi ) వాదనలు వినిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. """/" / ఈ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్న సింఘ్వీ ముఖ్యమంత్రిని, ముఖ్యమైన మంత్రులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.అదేవిధంగా అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదన్న సింఘ్వీ వారికి క్రెడిబులిటి లేదని చెప్పారు.

కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఈడీ ( ED )వద్ద ఆధారాలు ఉంటే మరి కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.

ఉల్లి-వెల్లుల్లి కలిపి ఇలా తీసుకుంటే గొంతు నొప్పి దెబ్బకు పరార్ అవుతుంది!