YS Sharmila : షర్మిలకు ఆ పదవి ఎందుకు మిస్ అయ్యింది ?
TeluguStop.com
వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి , తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన షర్మిలకు( Sharmila ) అక్కడి రాజకీయాలు, పరిస్థితులు అంతగా కలిసి రాలేదు.
పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువవ్వడం, ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపి తాను పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడం, కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో( Congress Party ) విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధితలు స్వీకరించారు .
వాస్తవంగా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు షర్మిల మొదట్లో ఇష్టపడలేదు.అయితే ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలతో పాటు, రాజ్యసభ సభ్యత్వం ఇస్తామనే హామీని కాంగ్రెస్ ఇవ్వడంతో, ఆమె అయిష్టం తోనే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సభ్యత్వం( Rajyasabha Member ) దక్కకపోవడం , కర్ణాటక నుంచి రాజ్యసభకు తనను పంపిస్తాననే హామీలు విస్మరించడం, పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ప్రాధాన్యం తగ్గించిందనే ప్రచారం జరుగుతుంది.
"""/" /
ఏపీ అధ్యక్షురాలిగా( AP PCC Chief ) మాత్రమే కొనసాగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నా ఆమెకు ఇవ్వలేదు.
రేణుకా చౌదరి,( Renuka Chowdary ) అనిల్ కుమార్ యాదవ్ లతో( Anil Kumar Yadav ) భర్తీ చేశారు.
ముందు నుంచి కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.
ఈ మేరకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోనూ షర్మిల చర్చలు జరిపారు.
దీంతో, కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపే ప్రతిపాదన కూడా వచ్చింది.తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది.
అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్ పేర్లు మాత్రమే కర్ణాటక కోటా లో ఇచ్చింది.
దీంతో షర్మిలకు అవకాశం దక్కలేదు. """/" /
వాస్తవంగా షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా , ఆమెకు ప్రోటోకాల్ కూడా వస్తుందని, ఏపీలో ఆమె విస్తృతంగా పర్యటించేందుకు మరింతగా దోహదపడుతుందని అంత భావించారు.
కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షర్మిలను త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాలని, కీలకమైన స్థానం నుంచి ఆమెను పోటీ చేయించాలని ఆలోచనతోనే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.
ఫస్ట్ టైమ్ కశ్మీరీ వంటకాన్ని ట్రై చేసిన ఫారిన్ చెఫ్.. ఆమె రియాక్షన్ ఇదే..