స్టార్ హీరోయిన్స్ ఉన్న కూడా చిరు కి మాధవి అంటే ఎంత స్పెషల్ తెలుసా ?

డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యాడు అంటూ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

ఎందుకంటే ఎంతోమంది విషయంలో ఇది నిజం కూడా అవుతూ ఉంటుంది.అచ్చం ఇలాగే పోలీస్ కావాల్సిన వ్యక్తి యాక్టర్ గా మారి, సుప్రీం హీరో గా ప్రేక్షకులకు దగ్గరై ఇక ఇండస్ట్రీలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించి మెగాస్టార్ గా మారాడు.

అతను ఎవరో కాదు మనందరికీ తెలిసిన మెగా స్టార్ హీరో చిరంజీవి.కెరియర్ ప్రారంభంలో ఎన్నో అవస్థలు పడ్డ చిరంజీవి ఆ తర్వాత కాలంలో మాత్రం తన టాలెంట్ తో ఎంతగానో ఎదిగాడు.

"""/"/ ఏకంగా తన సినిమాలో హీరోయిన్ ఎవరు అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలకు స్వయంగా చెప్పే స్థాయికి ఎదిగాడు చిరంజీవి.

అయితే ఇలా మెగాస్టార్ రికమెండ్ చేసిన హీరోయిన్ల లో 90'స్ హీరోయిన్ అయినా మాధవి కూడా ఒకరు.

మిగతా హీరోయిన్ల తో పోలిస్తే ఆమె కాస్త కలర్ తక్కువే.అయినా మాధవి చాల ఎక్కువ సినిమాలు చేసి తన నటనతో ఆకట్టుకుంది.

మాధవి చేసిన సినిమాలలో ఎక్కువ చిరంజీవి రికమెండ్ చేసి పెట్టుకున్నవే ఉండటం గమనించాల్సిన విషయం.

ముఖ్యంగా చిరంజీవి, మాధవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఖైదీ సినిమా.రగులుతుంది మొగలిపొద అనే పాట ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.

ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా సైతం 500 రోజులకు పైగా ప్రదర్శించబడింది.

"""/"/ అయితే అప్పట్లోనే మాధవి బికినీ వేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక మాధవి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అనే పేరు సంపాదించుకున్నాయి.ఇక చిరంజీవి ఒక దశలో ఆయన హీరోగా నటించే ప్రతి సినిమాకూ దర్శకులకు మాధవిని హీరోయిన్ గా తీసుకోవాలని రికమెండ్ చేశాడట.

కారణం ఆమె నటన మెగాస్టార్ ను బాగా ఆకట్టుకుంది.అంతే కాదు ఆమె కళ్ళు చాలా పెద్దవి.

దీంతో ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా అలవోకగా పలికిస్తు ఉండేది.తద్వారా తన పక్కన మాధవి అయితే బాగుంటుందని మెగాస్టార్ అనుకునేవాడు.

కేవలం మాధవి మాత్రమే కాదు విజయశాంతి, రాధ, రాధిక, సుహాసిని లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్న కూడా మెగాస్టార్ తన సినిమాల కోసం రికమెండ్ చేసినట్లు టాక్ ఉంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం.. ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి