చిరంజీవి కి సీఎం అవ్వాలనే కోరిక ఎలా పుట్టింది ?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో సాదా సీదా నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇక ఆ తర్వాత కాలంలో విలన్ గా ఆ తర్వాత హీరోగా మారిపోయి.

ఏకంగా తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా మారిపోయాడు.ఇక ఎన్నో దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువ హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రి ఇస్తున్నప్పటికీ అటు మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.

ఇండస్ట్రీలో నెంబర్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల వైపు అడుగులు వేశారు.

ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించాడు.2008లో రాజకీయాల్లోకి వెళ్లారూ మెగాస్టార్ చిరంజీవి.

అయితే ఒకప్పుడు ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించినట్లు గానే ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లో ఎంతో అద్భుతంగా రాణిస్తారు అని అందరూ అనుకున్నారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది.దీంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆయన కొన్నాళ్ల పాటు ఎంపీగా పనిచేశారు.

తర్వాత ఈ రాజకీయాలు మనకి ఒంట పట్టవు అనుకుని సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.

ఖైదీ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. """/"/ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి మళ్లీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచన రావడానికి అలా సినిమా కారణమని తెలుస్తోంది.

ఒకప్పుడు కోదండరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.

అందులో ఒకటి ముఠామేస్త్రి.ఈ సినిమాలో ఒక కూలి స్థాయి నుంచి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారు మెగాస్టార్ చిరంజీవి.

"""/"/ దీంతో నిజజీవితంలో కూడా మెగాస్టార్ నుముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులు అనుకున్నారట.చిరు మనసులో కూడా ఇలాంటి ఆలోచనే వచ్చింది.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.కలిసి రాకపోవడంతో మళ్ళీ సినిమాల్లో కి వెళ్లారు చిరంజీవి.

సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి..!!