ఆ దర్శకుడు ఎంత తిట్టిన చిరంజీవి మౌనంగా ఎందుకు ఉన్నారు

భారతీరాజా.దిగ్గజ దర్శకుడు.

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్.దర్శకుడిగా ఎనలేని ప్రతిభ ఉన్నా.

వ్యక్తిగతంగా బాగా కోపిష్టి.ప్రతి చిన్న విషయానికి ఆయనకు బాగా కోపం వస్తుంది.

ఏ పని చక్కగ చేయకపోయినా.టెక్నికల్ టీంతో పాటు ఆర్టిస్టులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవాడు.

షూటింగ్ సమయంలో ఈ కోపం స్థాయి మరింత ఎక్కువగా ఉండేది.నటీనటులు సీన్లు సరిగా చేయపోయినా.

సినిమా యూనిట్ సభ్యులు సరిగా పనిచేయకపోయినా విపరీతమైన కోపం ప్రదర్శించేవాడు.అందుకే ఆర్టిస్టులు, టెక్నికల్ టీం ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండేవారు.

ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేవారు.కోపాన్ని తగ్గించుకోవాలని ఆయన ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

అవి ఆరాధన సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు.నాగర్ కోయిల్ లో మండుటెండలో షూటింగ్ కొనసాగుతుంది.

పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది.భారతీరాజా చాలా కోపంగా, చిరాగ్గా ఉన్నాడు.

ఆ కోపం ఆర్టిస్టులతో పాటు యూనిట్ మెంబర్స్ మీద చూపిస్తున్నాడు.ఆ సినిమా హీరోయి అయిన చిరంజీవి పైనా తన కోపం ప్రదర్శించాడు.

అప్పుడు తెలుగులో చిరంజీవి టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.ఆ సినిమాకు నిర్మాతగా అల్లు అరవింద్ ఉన్నాడు.

అకారణంగా తన మీద కోపం చూపించడాన్ని చిరు తప్పుపట్ట వచ్చు.పిలిచి ఎందుకు అలా చేశావని అడగవచ్చు.

కానీ ఏమీ అనకుండా ఉనారు.కానీ భారతీరాజాను ఒక్కమాట కూడా అనలేదు.

డైరెక్టర్ తన మీద కోప్పడ్డాడనే విషయాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు. """/"/ ఈ విషయాన్ని స్వయంగా భారతీరాజా వెల్లడించాడు.

ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ఆలోచన ఉన్నతంగానే ఉంటుందని చెప్పాడు.చిరంజీవికి సభ్యత, సంస్కారం, ఓర్పు చాలా ఎక్కువ అని చెప్పాడు.

ఆ కారణంగా తను ఉన్నత స్థాయికి చేరుకున్నాడని చెప్పాడు.చిరంజీవి అంటే సినిమా పరిశ్రమలో అందరూ ఇష్టపడటానికి కారణం అదే అని చెప్పాడు.

ఆయన మంచి మనసు కారణంగా మంచి అవకాశాలు వచ్చాయన్నాడు.

కోమాలోకి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు సావిత్రి చెప్పిన మాటలు