శ్రీదేవి మెగాస్టార్ వజ్రాలదొంగ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ల మనందరికీ తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో ఎన్నో సినిమాలు విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎవరి సపోర్టు లేకుండా ఎదిగి స్టార్లుగా ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

వీరిద్దరిలో కామన్ గా కనిపించే పాయింట్ ఇద్దరు నిర్మాతలుగా మారడం.అయితే చిరంజీవి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొంత కాలం పాటు కొనసాగారు.

కానీ శ్రీదేవి మాత్రం మొదటి సినిమా ఆగిపోవడంతో ఆమె మళ్లీ నిర్మాతగా సినిమాలు చేయలేదు.

చిరంజీవి హీరోగా ఆమె తన సొంత సినిమాను ప్రారంభించగా దర్శకుడు కోదండరామిరెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారట.

తన చెల్లెలు శ్రీలత నిర్మాతగా లతా ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఈ చిత్రాన్ని ప్రారంభించారు శ్రీదేవి.

బప్పిలహరి సంగీత సారథ్యంలో ముంబైలో పాటలు రికార్డ్‌ చేశారట.అయితే రికార్డింగ్‌ సమయంలో శ్రీదేవి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు.

అయితే ఎప్పుడు ఎలా కలెక్ట్‌ చేశారో తెలీదు కానీ శ్రీదేవి దగ్గర బోలెడంత మ్యూజిక్‌ కలెక్షన్‌ ఉండడంతో అవన్నీ కూడా బప్పిలహరికి వినిపించి పాటలను రికార్డ్‌ చేయించుకున్నారట శ్రీదేవి.

ఇక ఈ సినిమాకు వజ్రాలదొంగ అని టైటిల్ ను అనుకున్నప్పటికీ దానిని అధికారికంగా మాత్రం ప్రకటించలేదట.

అయితే ఇక ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయానికి వస్తే.మణిరత్నం మౌనరాగం సినిమా లోని ఫ్లాష్‌బ్యాక్‌ స్ఫూర్తితో వజ్రాల దొంగ కథను రెడీ చేశారట.

ఇక రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ చెన్నైలో సెట్‌ వేసి ఓ పాట చిత్రీకరించగా అప్పటికే ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చిందట.

ఇకపోతే సాధారణంగా ఎప్పుడు కూడా బయ్యర్స్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి దగ్గరకి వచ్చి ఈ సినిమా మాకు ఇప్పించండి అని అడగలేదట.

కానీ ఈ సినిమాకు చాలామంది పోటీపడి ఆయన దగ్గరకు వచ్చి మరి రికమండ్‌ చేయమనే వారట.

సినిమా క్రేజ్‌ చూసి కోదండరామిరెడ్డికి డౌట్‌ వచ్చింది. """/"/ వెంటనే శ్రీదేవి దగ్గరకు వెళ్ళి అమ్మా.

నాకెందుకో మనం ఇప్పుడు చేస్తున్న సబ్జెక్ట్‌, అంచనాలను అందుకుంటుందా? లేదా? అనే చిన్న డౌట్‌ ఉంది.

ఏం చేద్దాం అని అడిగగా.సాంగ్స్‌ బాగున్నాయి.

సబ్జెక్ట్‌ గురించి నాకు పెద్దగా తెలీదు.పోనీ కొన్నాళ్ళు ఆపేసి, వేరే మంచి కథతో సినిమా చేద్దాం.

లేదంటే ఇదే కథను ఇంకా బాగా చేసే అవకాశం ఉందేమో చూడండి అని శ్రీదేవి చెప్పారట.

ఆ తర్వాత చాలామంది రచయితలతో కూర్చుని ఈ వజ్రాలదొంగ సినిమాపై కసరత్తులు చేశారట.

అయినా కూడా సంతృప్తికరంగా రావడంలేదు.ఇండియా సినిమాను తెలుగులో రీమేక్‌ చేద్దామా? అని శ్రీదేవి అడిగారు.

చిరంజీవిగారు కూడా ఆ సినిమా చూశారు.పెద్దగా నచ్చలేదు.

అందులోను సినిమా లెంత్ ఎక్కువ ఉందని భావించారట.అలా చివరకు చిరంజీవి, శ్రీదేవి ఇమేజ్‌కు తగ్గ కథ దొరకక ఈ చిత్ర నిర్మాణం ఆపేశారట.

సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!