కోటా విషయంలో ఇద్దరు లెజెండ్స్ మధ్య గొడవ ఎందుకు వచ్చింది?
TeluguStop.com
తెలుగు సినిమా పరిశ్రమలో ఓ రేంజి విక్టరీ కొట్టిన సినిమా ఆహనా పెళ్లంట.
మూడు దశాబ్దాల క్రింత విడుదల అయినా.ఇప్పటికీ బెస్ట్ కామెడీ మూవీగా ఈ సినిమా పేరునే చెప్పుకోవచ్చు.
ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ జనాలు అతుక్కుపోతారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే ఈ సినిమాలోని కీ రోల్ లక్ష్మీపతి.జంధ్యాల ఈ పాత్రను ఓ రేంజిలో తీర్చిదిద్దాడు.
ఈ పాత్ర సక్సెస్ అయితేనే సినిమా హిట్ అవుతుందని జంధ్యాల భావించాడు.లేదంటే పరాజయం తప్పదని చెప్పాడు.
కీలక పాత్ర కావడంతో ఈ క్యారెక్టర్ ను రావుగోపాల రావుతో చేయించాలని చెప్పాడ నిర్మాత రామానాయుడు.
అతడు అయితేనే బాగుంటుందని చెప్పాడు.కానీ ఈ పాత్రకు కోటా శ్రీనివాసరావు బెస్ట్ అని జంధ్యాల వాదన.
ఇద్దరూ 20 రోజుల పాటు ఈ క్యారెక్టర్ విషయంలో వాదనలు వినిపించుకున్నారు.కొద్ది రోజుల తర్వాత ఎయిర్ పోర్టులో కలిసిన కోటాను.
రామానాయుడు పిలిచాడు.జరిగిన విషయం వివరించాడు.
వాదన ఎందుకండీ ఈ అద్భుత క్యారెక్టర్ కు న్యాయం చేసేది రావు గోపాల రావే అని చెప్పాడు కోటా.
కానీ.రావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్ నెస్ రాదంటున్నారు జంధ్యాల అని చెప్పాడు రామానాయుడు.
కోటాకు ఏం చెప్పాలో తెలియట్లేదు.ఓ చిన్న నటుడు అయిన తనతో రామానాయుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడో అర్తం కాలేదు.
"""/"/
ఇక విషయాన్ని కొనసాగించడం ఇష్టం లేని రామమానాయుడు.కోటాకు అదిరిపోయే వార్త చెప్పాడు.
లక్ష్మీపతి క్యారెక్టర్ నీతోనే చేయించాలని అనుకుంటున్నాడు జంధ్యాల అని చెప్పాడు.నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టం.
ఈ పాత్ర అద్భుతంగా చేస్తే.నీ దశ మారిపోతుందని చెప్పాడు.
ఆ మాట విన్న కోటాకు ఇది నిజమేనా అనే అనుమానం కలిగింది.అయితా ఈ సినిమాలో అద్భుతంగా నటించి.
అద్భుత నటుడిగా ఎదిగాడు కోటా శ్రీనివాసరావు.
యూకే: ఎత్తు శాపమనుకుంది… ఇప్పుడదే లక్షణంతో కోట్లకు పడగలెత్తింది!