పుష్ప 2 మీద ఈ రేంజ్ లో హైప్ ఎందుకు పెంచుతున్నారు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న దర్శకులందరూ వాళ్లకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వాళ్లే కావడం విశేషం.
ఇక ముఖ్యంగా సుకుమార్( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఎప్పుడు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉండబోతున్నాయనేది తెలియాలంటే మాత్రం పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
"""/" /
ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా మొత్తంలో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం సుకుమార్ అహర్నిశలు కష్టపడుతున్నాడు.
ఇక అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇండియాలో ఉన్న టాప్ హీరోలు అందరూ సుకుమార్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
"""/" /
మరి అలాంటి స్టార్ డమ్ అందుకుంటున్న దర్శకుడు ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతున్నాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ( Allu Arjun
)ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ సినిమా ఫస్టాఫ్ చూసి చాలా అద్భుతంగా ఉందని సినిమా మీద భారీ హైప్ పెంచాడు.
అలాగే ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ ఈ సినిమాలోని రెండు సీన్లు చూశానని అవి అద్భుతం ఉన్నాయని కూడా తెలియజేశాడు.
చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది.
హైదరాబాద్‌లో రూ.15 లక్షల బ్యాగ్ చోరీ…ముగ్గురి అరెస్ట్