బ్రిటన్ ప్రధానిపై విమర్శలు.. ఎందుకు చేస్తున్నారంటే..

వీధుల్లో జీవించే ఒక అభాగ్యుడితో బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

తనకంటూ ఒక ఇల్లు కూడా లేని వ్యక్తి పట్ల రిషికి జాలి కూడా లేదు అని ప్రతిపక్ష నేతలు భారీగా విమర్శిస్తున్నారు.

పేద ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని అందించే ఒక కేంద్రంలో రిషి జరిపిన సంభాషణపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది విమర్శిస్తున్నారు.

సామాజిక సేవలో భాగంగా రిషి ఇటువాల ఉచిత ఆహార కేంద్రంలో ఆహారాన్ని వడ్డిస్తుండగా ఒక వ్యక్తి ఆహారం కౌంటర్ వద్దకు వచ్చాడు.

దీనివల్ల రిషి అతడిని పలకరించి మీకు ఏ ఫుడ్ ఇష్టమని ప్రశ్న వేశారు.

అప్పుడు మీరు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారా అంటూ రిషిని అతడు అడగడంతో ఆయన అవునని సమాధానం ఇచ్చారు.

"""/"/ అయితే పేదరికంతో ఇబ్బంది పడుతున్న అతడిని రిషి మీరు ఉద్యోగం చేస్తున్నారా అని అడగడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఇబ్బంది పడ్డాడు.

ఆ తర్వాత తేరుకొని తనకు తల దాచుకునేందుకు ఇల్లు లేదని ప్రస్తుతం వీధుల్లోనే జీవిస్తున్నానని చెప్పాడు.

రిషి ఎందుకు అలా ప్రశ్న వేశారో స్పష్టత ఎవరికీ లేదు.ప్రతిపక్షాలకు మాత్రం ఆయనను టార్గెట్ చేసేందుకు అవకాశం దొరికింది.

ఈ సంభాషణ గురించి ప్రతిపక్ష నేత ఆంజెలా రీనాయిర్ రిషి తీరుపై విమర్శలు గుప్పించారు.

ఒక అభాగ్యుడ్ని ఇలా అడగడం మీకు ఎంతవరకు సమంజసం అని కూడా విమర్శిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే నేటిజెన్లు కూడా రిషి పై మండిపడుతున్నారు.కేవలం ఫోటోలకు ఫోజు ఇవ్వడానికే అతనితో మాట కలిపినట్లు ఉందని, అతని పట్ల రిషికి సానుభూతి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిషికి సామాన్య ప్రజల కష్టాలు తెలియవని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నారు.

మహేష్ బాబు సినిమాతో రాజమౌళి కి ఆస్కార్ అవార్డు వస్తుందా..?