ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎందుకు ప్లాప్ సినిమాలను చేస్తున్నారు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి నటులు చాలా మంది ఉన్నారు.
అందులో రవితేజ విజయ్ దేవరకొండ( Ravi Teja Vijay Devarakonda ) లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.
ఇక వీళ్లిద్దరూ ప్రస్తుతం వరుస ప్లాపులతో ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో వీళ్ళిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు.
మరి అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఎందుకు సినిమా స్టోరీ లను సెలెక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
నాని లాంటి స్టార్ హీరో వరుస సక్సెస్ లతో ముందుకు సాగుతుంటే వీళ్ళు మాత్రం సక్సెస్ కొట్టడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
"""/" /
మరి మొత్తానికైతే వీళ్లు మొదటి మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికీ ఇప్పుడు ఆ సక్సెస్ ట్రాక్ ని నిలబెట్టుకోవడంలో మాత్రం చాలా వరకు వెనకబడి పోతున్నారనే చెప్పాలి.
ఇక ఇప్పటికే వీళ్లు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో డిజాస్టర్లుగా మిగులుతున్నాయి.ఇక రీసెంట్ గా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ( Mr.
Bachchan )డిజాస్టర్ అవ్వడమే కాకుండా రవితేజకు బ్యాడ్ నేమ్ ని కూడా తీసుకువచ్చింది.
అలాగే విజయ్ దేవరకొండ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా ( The Family Star)భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.
మొత్తానికైతే వీళ్లు సక్సెస్ ట్రాక్ ని కొనసాగించాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
"""/" /
ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులు ఎలాంటి కథలను కోరుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి వీళ్ళు సినిమాలు చేస్తే బాగుంటుంది.
లేకపోతే మాత్రం వరుస డిజాస్టర్లు ఎదురుకొక తప్పదు.దాని ద్వారా వాళ్ళ మార్కెట్ తగ్గడమే కాకుండా రోజు రోజుకి వాళ్ళ క్రేజ్ కూడా పడిపోతుందనే చెప్పాలి.
మరి ఇక మీదటైనా వీళ్లు వరుస సక్సెస్ లను సాధిస్తు ముందుకు దూసుకెళ్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఏ జానర్ లో ఉండబోతుందో తెలుసా..?