బడాబాబులు 6 శాతం పెట్టుబడులు బంగారంపైనే పెడుతున్నారెందుకని?
TeluguStop.com
అవును, మీరు విన్నది నిజమే.అయితే ఈ విషయం మీకు తెలుసునంటారా? తెలిసే ఉంటుంది.
ఎందుకంటే కాస్త డబ్బులు ఎక్కువైనవారు భవిష్యత్ అవసరాలకోసం పెద్దమొత్తంలో మొదట భూమిమీద, తరువాత బంగారు ఆభరణాలపైన పెట్టుబడులు పెడతారనే విషయం అందరికీ తెలిసినదే.
ఇపుడు ఇదే విషయం దేశంలోని అత్యంత సంపన్న వర్గం(యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) 2022లో తమ మొత్తం పెట్టుబడిలో 6 శాతం బంగారంపై( Gold ) పెట్టారని ఓ నివేదిక వెల్లడించింది.
"""/" /
ఈ క్రమంలో చైనాలోని( China ) అధిక సంపన్నులు సైతం బంగారంపై 6 శాతం పెట్టుబడి పెడుతున్నారని సమాచారం.
భారత్ తరువాత ఇలా బంగారంపైన పెట్టుబడిన అత్యంత శాతం ప్రజలు చైనాలోనే వున్నారని నైట్‌ఫ్రాంక్( Knightfrank ) ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక మొదటిస్థానంలో ఆస్ట్రియాలోని అత్యంత సంపన్న వర్గం తమ సంపదలో 8 శాతాన్ని బంగారంపై పెట్టారు.
ప్రపంచ, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల సగటు కంటే భారతీయ అధిక సంపన్నులే ఎక్కువగా బంగారం కోసం కేటాయిస్తున్నారని తెలుస్తోంది.
"""/" /
అదేవిధంగా గత సంవత్సరం ప్రపంచంలోని యూహెచ్ఎన్‌డబ్ల్యూఐలు( UHNWIs ) బంగారంపై 3 శాతం పెట్టుబడి పెట్టగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతం సగటు బంగారంపై 4 శాతం పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తోంది.
కొన్నేళ్లుగా పసిడి అందిస్తున్న రాబడి కారణంగానే సంపన్నులు బంగారంపై అత్యధిక పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది.
2019-2023 మధ్య ఐదేళ్లలో బంగారం 69 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక కరోనా మహమ్మారి, తక్కువ వడ్డీ రేట్లు, ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన లిక్విడిటీ చర్యలతో పసిడి ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!