జర్మనీ తరలిపోతున్న ఇండియన్స్.. కానీ ఎందుకు..?
TeluguStop.com
భారతీయులు తమ దేశాన్ని విడిచిపెట్టి జర్మనీని( Germany ) పెద్ద ఎత్తున ఎందుకు తరలి వెళ్తున్నారో అమృతా దత్తా( Amrita Datta ) అనే ఓ సామాజిక శాస్త్రవేత్త ఓ పుస్తకంలో విశ్లేషించారు.
జర్మనీలోని భారతీయ వలసదారులపై( Indian Immigrants ) దశాబ్దం క్రితం నుంచి ఆమె అధ్యయనం చేపట్టారు.
అయితే వలసలకు కారణాలు సంక్లిష్టంగా ఉన్నాయని ఆమె వెల్లడించారు.రిఫ్లెక్సివిటీ, ఆటోఎథ్నోగ్రఫీ, గుణాత్మక విశ్లేషణలను ఉపయోగించి, ఈ ధోరణిని అర్థం చేసుకోవడానికి ఆమె తన వ్యక్తిగత అనుభవాన్ని పరిశోధనతో మిళితం చేశారు.
యూరప్‌లో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని భావించే చాలా మంది భారతీయులకు జర్మనీ టాప్ డెస్టినేషన్ గా మారింది.
దీనికి ప్రధాన కారణం యూరోపియన్ యూనియన్( European Union ) అనే సంస్థ ఇచ్చే 'బ్లూ కార్డ్'.
( Blue Card ) ఈ కార్డు వల్ల భారతీయులు జర్మనీలో ఉద్యోగం చేయడానికి, తమ కుటుంబాలతో కలిసి జీవించడానికి అనుమతులు పొందుతున్నారు.
అంతేకాకుండా, జర్మనీలో చదువు చాలా మంచి నాణ్యతతో ఉంటుంది.ఇక్కడ ఎడ్యుకేషన్( Education ) చాలా ఖరీదైనది కూడా కాదు కాబట్టి చాలా మంది భారతీయ విద్యార్థులు కూడా జర్మనీకి వెళ్తున్నారు.
"""/" /
భారతదేశంలో రాజకీయ సమస్యలు, స్వేచ్ఛ లేకపోవడం, ఉద్యోగాలు దొరకకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది భారతీయులు జర్మనీకి వెళ్తున్నారని ఆమె తన బుక్ లో తెలిపారు.
ఆ రచయిత చాలా మంది భారతీయులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.ఆ భారతీయులు ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి జర్మనీకి వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
"""/" /
2015 నుంచి చాలా మంది భారతీయులు జర్మనీకి వెళ్తున్నారు.వారు వివిధ మతాలు, జాతులు, లింగాలకు చెందినవారు.
భారతదేశం ప్రజాస్వామ్య దేశమే అయినప్పటికీ, 7,000 మందికి పైగా భారతీయులు జర్మనీలో 'రక్షణ' కోరుతూ వెళ్తున్నారు.
వీరిలో చాలా మంది ఉద్యోగం లేదా చదువు కోసం వెళ్తున్నారు.కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా మంది భారతీయులు జర్మనీలో మంచి వైద్య సేవలు ఉన్నాయని భావించి వెళ్తున్నారు.
అంతేకాకుండా, భారతదేశంలో మైనారిటీలపై( Minorities ) దాడులు జరుగుతున్నాయి, మహిళలపై హింస జరుగుతుంది, భద్రత, అవకాశాలు లేవు కాబట్టి చాలా మంది భారతీయులు జర్మనీకి వెళ్తున్నారు.
అయితే జర్మనీలో నల్లగా ఉన్న వారిని ఆ దేశస్తులు చులకనగా చూస్తారని రచయిత హెచ్చరించారు.
90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..