ఆ స్టార్ డైరెక్టర్ శిష్యులు మాత్రమే డైరెక్టర్లుగా ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే..?

చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీస్తూ వాళ్ళకంటే ఒక మంచి పేరు సంపాదించుకుంటు ఉంటారు.

అయితే వాళ్ల దగ్గర పని చేస్తూ ఉన్న చాలా మంది కూడా సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి వర్క్ నేర్చుకోవడానికి అయా డైరక్టర్ల దగ్గర పని చేస్తూ ఉంటారు.

అయితే ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద డైరక్టర్ల అందరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా డైరెక్షన్ చేయడమే ధ్యేయం గా పెట్టుకుంటారు.

అలా వాళ్ళు కూడా ఒక మంచి కథ రాసుకొని ఒక హీరోకి కథ చెప్పి ఒప్పించుకొని డైరెక్షన్ లోకి దిగుతారు.

అయితే ఇలా చాలా మంది డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ల శిష్యులు డైరెక్టర్లు గా ఫెయిల్ అవుతున్నారు.

కానీ ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సుకుమార్(Sukumar ) దగ్గర నుంచి వచ్చిన ఆయన శిష్యులు డైరెక్టర్లు గా మంచి సక్సెస్ లు కొడుతున్నారు.

ఇప్పటికే బుచ్చిబాబు (Buchi Babu)సాన డైరెక్టర్ గా మారి ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కూడా దసర సినిమాతో మంచి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.

"""/" / ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న వీరూపాక్ష(Veerupaksha) సినిమాతో కార్తిక్ వర్మ దండు అనే డైరెక్టర్ కూడా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నారు వీళ్లంతా కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు గా చేసినవారే కావడం విశేషం ఇప్పటికే బుచ్చిబాబు హిట్ కొట్టాడు ఇక వీళ్లిద్దరూ కూడా మంచి హిట్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది.

శ్రీకాంత్ ఓదెల దసర సినిమా, కార్తిక్ దండు వీరూపాక్ష సినిమాల నుంచి వచ్చిన టిజర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ టీజర్స్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటాయని.

అమెజాన్ అడవిలో సంచరిస్తున్న ఓ అరుదైన తెగ ఇదే?