ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?
TeluguStop.com
కొత్త యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సోమవారం ఓ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
127 ఏళ్ల నాటి చట్టాన్ని మార్చేస్తూ, ఇకపై అమెరికాలో పుట్టిన ఎవరికీ పౌరసత్వం రాదని తేల్చి చెప్పారు.
ఇంతకుముందు అమెరికా గడ్డపై పుడితే చాలు, వారి తల్లిదండ్రులు ఎవరైనా సరే అమెరికన్ సిటిజన్ షిప్ ( American Citizen Ship )వచ్చేసేది.
కానీ ఇకపై ఆ రూల్స్ మారిపోనున్నాయి.కొత్త రూల్ ప్రకారం, పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి.
ఫిబ్రవరి 20 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది.అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాలు, పలు మానవ హక్కుల సంఘాలు కోర్టుల్లో కేసులు వేశాయి.
ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు ట్రంప్.అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ( US-Mexico Border )అక్రమ వలసలను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో తాత్కాలిక వీసాలపై( Visas In The US ) ఉంటున్న భారతీయ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
ముఖ్యంగా హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఉన్నవారు ఇప్పుడు కంగారు పడుతున్నారు.ఈ వీసాలు శాశ్వత నివాసాన్ని ఇవ్వవు.
దీంతో చాలామంది గర్భవతులు తమ పిల్లలు ఫిబ్రవరి 20లోపు పుట్టేలా ముందస్తు సిజేరియన్ చేయించుకోవడానికి డాక్టర్లను వేడుకుంటున్నారు.
ఫిబ్రవరి 20 తర్వాత పుడితే తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదేమోనని వారు భయపడుతున్నారు.
"""/" /
అమెరికాలోని డాక్టర్లు ఇలాంటి విజ్ఞప్తులు పెరిగిపోయాయని చెబుతున్నారు.ఏడో, ఎనిమిదో నెలల గర్భిణులు కూడా ముందస్తు ప్రసవం కోసం అడుగుతున్నారట.
అయితే, వైద్య నిపుణులు మాత్రం ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందకపోవడం, బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
చాలామంది భారతీయ కుటుంబాలకు అమెరికాలో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.గ్రీన్ కార్డ్ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు మాత్రం అయోమయంలో పడిపోయారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వలస విధానాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంది.
ఇది పెద్ద రాజకీయ, న్యాయ పోరాటానికి దారి తీసే అవకాశం ఉంది.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?