సర్వేలన్నీ జగన్ కే అనుకూలం ఎందుకు ?

సర్వేలన్నీ జగన్ ( AP CM Jagan ) కే అనుకూలం ఎందుకు ?ఏపీలో ఎన్నికలకు( Election In AP ) సరిగ్గా పది నెలలు మాత్రమే సమయం ఉంది.

టిడిపి, వైసీపీ, జనసేన( TDP, YCP, Jana Sena ).ఇలా ప్రధాన పార్టీలను గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాయి.

సంక్షేమ ఎజెండాతో మళ్ళీ అధికారం మాదే అంటూ వైసీపీ చెబుతుంటే.సైకో పాలన ప్రజలకు నచ్చట్లేదని వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం పక్కా అని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నారు.

అటు జనసేన అధికారం కోసం పాకులాడకుండా కింగ్ మేకర్ పాత్ర కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిది అనే దానిపై ఎలాంటి సర్వేలు వచ్చిన, విశ్లేషణలు వచ్చిన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్( Hot Topic In AP Politics ) గా మారుతున్నాయి.

ఇప్పటివరకు చాలానే సర్వేలు ఏపీ ప్రజల నాడీని వ్యక్తపరిచే ప్రయత్నం చేశాయి. """/" / అయితే దాదాపు అన్నీ సర్వేలు కూడా మళ్ళీ అధికారం జగన్ దే అని చెబుతున్నాయి.

తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది.

వచ్చే ఎన్నికల్లో జగన్ 150 సీట్లకు పైగా కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది.

సర్వేలన్నీ ఈ స్థాయిలో జగన్ కుజ్ అనుకూలంగా వస్తున్నప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉంది అనే ప్రశ్న రాక మానదు.

నిజానికి జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉందనే మాట అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం.

ఎందుకంటే నిత్యవసర ధరల పెరుగుదల, మితిమీరిన పన్నులు, ఇసుక మాఫియా, ఇచ్చిన హామీలను అట్టకెక్కించడం, నిరుద్యోగులకు నో జాబ్ క్యాలెండర్, ఇలా చాలా అంశాలపై జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం ఉంది.

అలాగే ఆయా నియోజిక వర్గాలలోని ఎమ్మెల్యేలపై కూడా అవినీతి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

"""/" / మరి ఈ స్థాయిలో వైసీపీ సర్కార్ ను ప్రజా వ్యతిరేకత వెంటాడుతుంటే.

సర్వేలన్నీ జగన్ కు ఎందుకు అనుకూలంగా వస్తున్నట్లు అనే డౌట్ వస్తుంది.కాగా జగన్ సర్కార్ పై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికి.

ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు సచివాలయ వ్యవస్థ, వాలెంటరీ వ్యవస్థలపై ప్రజల్లో మంచి సానుకూలత ఉంది.

అమ్మ వొడి, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా,.ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

వీరంతా కూడా మళ్ళీ జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.అందుకే ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నిటిలో జగన్ దే పై చెయ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి నిజంగా ప్రజల్లో జగన్ పథకాలకు ఆ స్థాయిలో ఆధారణ లభిస్తోందా అనేది తెలియాలంటే.

ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.

విజయ్ త్రిష మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు.. జస్టిస్ ఫర్ సంగీత అంటూ?