అనుష్క సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా?
TeluguStop.com
అనుష్క శెట్టి.తెలుగు సినీ జనాలకు ఈమె గురించి పరిచయం పెద్దగా అవసరం లేదు.
పూరీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ బ్యూటీ.
ఆ తర్వాత విక్రమార్కుడు సినిమాతో తనలోని అంద చందాలను బయటపెట్టి కుర్రకారుకు కిక్కెక్కించింది.
ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో అనుష్క కెరీర్ మంచి స్వింగ్ అందుకుంది.ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ బెంగళూరు బ్యూటీ.
వరుస సినిమాలను దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది.అనుష్కకు అద్భుత పేరు తెచ్చిన సినిమా అరుంధతి.
కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుష్కను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మార్చింది.
2009లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమాలో అనుష్క పోషించిన జేజమ్మ పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి.తన అద్భుత నటనతో జనాలను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత వచ్చిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమా అనంతరం మరిన్ని అవకాశాలతో ముందుకు సాగుతుంది అనుకున్నా.
దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది అనుష్క.ఈ సినిమా అనంతరం సినిమాలను చేయడం లేదు.
"""/"/
అనుష్క ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే విషయంపై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా దీనికి సంబంధించిన విషయం తెలిసింది.వాస్తవానికి బాహుబలి సినిమా సమయంలోనే అనుష్క జీరో సైజ్ సినిమా చేసింది.
అప్పుడు బాగా బరువు పెరిగింది.కానీ ఆ బరువు త్వరగా తగ్గలేదు.
ఈ నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలు చేయలేదట.చాలా రోజుల తర్వాత అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది.
పి.మహేష్ బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపింది.
నవీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా చేస్తున్నాడు.
రూ.1.50 కోసం 7 ఏళ్ల పోరాటం.. గ్యాస్ ఏజెన్సీకి దిమ్మతిరిగే షాక్!