‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి ‘ ! ఈ స్లోగన్ ఏంటంటే ?

ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు, వినూత్న పథకాలను అమలు చేస్తూ , జనాల్లో తమ పేరు తమ పార్టీ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ( CM Jagan )అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం 6 నెలలు సమయం మాత్రమే ఉండడంతో , పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపడంతో పాటు,  ప్రజల్లోనూ మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలనే విధంగా వినూత్న కార్యక్రమాలకు జగన్ తెర తీస్తున్నారు.

పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు.

'' అసెంబ్లీ సమావేశాలు బుధవారం ముగుస్తాయి.మరునాటి నుంచి వచ్చే ఎన్నికల కోసం పార్టీ గేర్ మార్చాలి'' అంటూ జగన్ పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు.

"""/" / " ఈ నాలుగున్నరేళ్లు చేసింది ఒక ఎత్తు.వచ్చే ఆరు నెలలు మరో ఎత్తు.

రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలి.ఇందుకోసం అధికారికంగా '' జగనన్న ఆరోగ్య సురక్ష '' , పార్టీపరంగా ' ఎందుకు ఆంధ్రాకి జగనే ( CM Jagan )కావాలి ' అనే కార్యక్రమాలను ఇస్తున్నాం' అని జగన్ ( CM Jagan )ప్రకటించారు.

వైసిపి ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు,  నియోజకవర్గ ఇన్చార్జీలు,  ప్రాంతీయ సమన్వయకర్తలు,  జిల్లా అధ్యక్షులతో నిన్న పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం లో జగన్ ( CM Jagan ) ఈ వ్యాఖ్యలు చేశారు.

"""/" / " నియోజకవర్గాల్లో సర్వేలు చివరికి వచ్చాయి.వచ్చే రెండు నెలలు మీకు కీలకం.

మీలో చాలామందికి మళ్ళీ టికెట్లు రావచ్చు .కొందరికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు .

ప్రజల్లో మీరు ఉంటున్న తీరు మీకున్న ఆదరణ వంటి వాటిని బేరేజ్ వేసుకుని ఎన్నికల్లో తప్పులు చేయకూడదని తీసుకుని నిర్ణయాలకు సహకరించాలి టికెట్ వచ్చిన రాకపోయినా మీరు నా మనుషులే.

175 కు 175 స్థానాలు సాధ్యమే క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు ఉన్నాయి కాబట్టే ప్రతిపక్షాలు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తుల కోసం వెతుక్కుంటున్నాయి.

ఇదే విశ్వాసం ఇదే ధైర్యం, ఇదే ముందుచూపు ప్రణాళికతో అడుగులు వేయాలి .

మండల ,గ్రామ స్థాయి నాయకులతో విభేదాలను వెంటనే పరిష్కరించుకోండి" అని జగన్ ( CM Jagan ) సూచించారు.

 ''ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి '' అనే పార్టీ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఐపాక్ వ్యవస్థాపకుడు రిషి రాజు ప్రజెంటేషన్ లో వివరించారు .

ప్రభుత్వపరంగా చేపట్టే జగనన్న ఆరోగ్య సురక్ష గురించి కూడా ఆయన వివరించారు

చరణ్ పాత్రకు సంబంధించి అలాంటి లోపం.. సినిమాకు అదే ప్లస్ కాబోతుందా?