అల్లు వారి హీరో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడా ఏంటీ?

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కు వరుసగా సినిమాలు చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఆచితూచి సినిమాలు చేస్తూ వస్తోంది.

హీరోగా ఆయన తల్చుకుంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయవచ్చు.ఆయన సినిమాలు ప్లాప్ అయినా కూడా దర్శకులు.

నిర్మాతలు కొదువలేదు.సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది.

మీడియం బడ్జెట్‌ తో వరుసగా సినిమాలను చేయవచ్చు.కాని అల్లు శిరీష్ మాత్రం అలా చేయడం లేదు.

వరుస సినిమాలు చేయకుండా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.ఈయన చివరి సినిమా విడుదల అయ్యి మూడు ఏళ్లు అవుతుంది.

అయినా ఇప్పటి వరకు తదుపరి సినిమా కనీసం మొదలు పెట్టినట్లుగా కూడా దాఖలాలు కనిపించడం లేదు.

ఆ మద్య ఒకటి రెండు సినిమాల గురించి వార్తలు వచ్చాయి కాని అవి కూడా ఇంకా పట్టాలు ఎక్కాయా లేదా అనేది తెలియడం లేదు.

మొత్తంగా అల్లు వారి శిరీష్‌ సినిమా లు ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు.

ఒక వైపు అల్లు అర్జున్‌ ఇతర మెగా హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

కాని కొత్త ఇంకా సక్సెస్ కూడా కాని అల్లు శిరీష్ మాత్రం కనీసం ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు.

ఈ కరోనా సమయంలో పలువురు పలు సినిమా లు చేశారు.కాని ఈయన మాత్రం కొత్త సినిమా లకు కమిట్‌ అవ్వలేదు.

కొత్త సినిమాలేమి చేయలేదు. """/"/దాంతో అసలు అల్లు శిరీష్ ఇండస్ట్రీలో ఉన్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు ఆయన సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.

పెద్ద ఎత్తున అల్లు శిరీష్ సినిమా లు ఉంటాయనుకుంటే ఇప్పటి వరకు ఆయన నుండి వచ్చిన సినిమా లు మూడు నాలుగు మాత్రమే.

వాటిలో కూడా ఏ ఒక్కటి పెద్దగా సక్సెస్ దక్కించుకున్న సినిమా లు లేవు.

మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి అల్లు శిరీష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఆయనకే తెలియాలి.

జగన్ కోసం సిద్ధం : ప్రతి ఇంటికి వెళ్లేలా సరికొత్త ప్లాన్