అల్లు అరవింద్ పెద్ద సినిమాల జోలికి ఎందుకు వెళ్లడం లేదు?
TeluguStop.com
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు అనడంలో సందేహం లేదు.అయితే ఈ మధ్య కాలం లో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్న నిర్మాతల జాబితా తీస్తే మాత్రం అందులో అల్లు అరవింద్ పేరు కనిపించడం లేదు.
అందుకు కారణం ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు.చాలా కాలంగా పెద్ద చిత్రాల కంటే కూడా ఎక్కువగా చిన్నచిత్రాలను అల్లు అరవింద్ నిర్మిస్తూ వస్తున్నాడు.
చిన్న చిత్రాలు రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ అనే ఉద్దేశంతో అల్లు అరవింద్ ఈ విధంగా ముందుకు సాగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ పెద్ద సినిమాలను నిర్మించకుంటే మరెవ్వరు భారీ చిత్రాలను.
ప్రతిష్టాత్మక సినిమా లను నిర్మిస్తారు అంటూ మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
అల్లు అరవింద్ తలచుకుంటే వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి అద్భుతమైన సినిమాలను నిర్మించగలరు.
కానీ ఆయనకు మాత్రం భారీ చిత్రాలపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా లేదు.చిన్న చిత్రాలను సంవత్సరంలో మూడు నాలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
కానీ పెద్ద సినిమాలను మాత్రం పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. """/" / తన ఫ్యామిలీ హీరోలతో అయినా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించవచ్చు కదా అంటూ కొందరు ప్రశ్నించిన సమయంలో బయట నిర్మాతలకే వాళ్ళు డేట్లు ఇస్తున్నారు, నాకు డేట్లు ఇవ్వడం లేదు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తో అల్లు అరవింద్ ఒక సినిమా ను నిర్మించాలని మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
అది ఎప్పటికి సాధ్యమవుతుంది అనేది చూడాలి.అలాగే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ ని కూడా అల్లు అరవింద్ నిర్మించాలని భావిస్తున్నాడు.
ఆ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.