హలో జక్కన్న మా 'సీత' ఎక్కడ.. ఆర్ఆర్‌ఆర్ ప్రమోషన్స్ పై అసంతృప్తి
TeluguStop.com
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ లో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు హీరోలు మరియు దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు.
అంతే కాకుండా కన్నడ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు.కానీ హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ మాత్రం కనిపించకపోవడం పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ఆ ఈవెంట్ కు మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా ఆమె కనిపించడం లేదు.
సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించిన సమయం లో ఆలియా భట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది.
కానీ ఈ సారి మాత్రం ఆమె ప్రమోషన్ కార్యక్రమాల కు దూరంగా ఉండడం పట్ల అభిమానులు మరియు సినీ ప్రేమికులు అసంతృప్తి తో ఉన్నారు.
రాజమౌళి ఎందుకు ఆమెను తీసుకు రావడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తే మరి కొందరు మాత్రం ఆమె బిజీగా ఉండడంతో రావట్లేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తానికి ఆలియా భట్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రాకపోవడం పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
"""/"/
మరి రాజమౌళి నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.ఆలియా ప్రమోషన్ కార్యక్రమాల చివరి రోజు అయినా వస్తుందేమో చూడాలి.
ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడీ గా నటించిన విషయం తెలిసిందే.
ఆమె పాత్ర సినిమా కు ప్రధాన ఆకర్షణ గా ఉంటుంది అంటూ జక్కన్న మరియు ఇతర యూనిట్ సభ్యులు తెలియజేశారు.
అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర లో నటించి ప్రమోషన్ కార్యక్రమాల కు హాజరు కాకపోవడం ఏంటి అంటూ కొందరు ఈ సమయం లో ప్రశ్నిస్తున్నారు.