సేమ్ కథ,సేమ్ దర్శకుడు.. రెండు సినిమాలు హిట్, ఒకటి ఫట్..

సేమ్ కథ,సేమ్ దర్శకుడు రెండు సినిమాలు హిట్, ఒకటి ఫట్

తల మీద శని ఉంటే ఎవరు ఏం చేయగలరు.? అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ విషయంలోనూ ఇదే అనిపించింది.

సేమ్ కథ,సేమ్ దర్శకుడు రెండు సినిమాలు హిట్, ఒకటి ఫట్

ఇద్దరు హీరోలు ఒకే కథతో హిట్ కొడితే అదే కథతో సినిమా తీసిన అఖిల్ మాత్రం బాక్సీఫీస్ దగ్గర బోల్తా కొట్టాడు.

సేమ్ కథ,సేమ్ దర్శకుడు రెండు సినిమాలు హిట్, ఒకటి ఫట్

నిజానికి ప్రతి సినిమాలోనూ కథ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు.చాలా సినిమాల్లోనూ కథలు ఒకేలా ఉన్నా స్క్రీన్ ప్లేలో కొత్తదనం చూస్తుంటాం.

అంతేకాదు.ప్రజెంటేషన్ లో ఆకట్టుకుంటే సినిమా హిట్ అని చెప్పుకోవచ్చు.

కానీ సేమ్ కథలతో వచ్చిన కొన్ని సినిమాలు జనాలు రిసీస్ చేసుకునేలా లేకపోతే ఫట్ అవడం ఖాయం.

అలా ఒకే థీమ్ తో మూడు సినిమాలు రాగా అందులో రెండు హిట్ కొట్టి ఒకటి మాత్రం ఫ్లాప్ అయ్యింది.

ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తొలిప్రేమ.

2018లో విడుదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాకు అసలు అసెట్ హీరో, హీరోయిన్.ఇందులో హీరోగా వరుణ్ తేజ్ నటించగా హీరోయిన్ గా రాశీఖన్నా యాక్ట్ చేసింది.

"""/"/ అదే వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా మిస్టర్ మజ్ను.

ఈ సినిమాలో పాటలు, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఈ సినిమా స్టోరీ కూడా తొలి ప్రేమ సినిమాకు దగ్గరగా అనిపిస్తుంది.

"""/"/ అటు మళ్లీ వెంకట్ దర్శకత్వం వహించిన సినిమా రంగ్ దే.ఈ సినిమా కూడా సేమ్ అదే కథతోనే ముందుకు సాగుతుంది.

నితిన్, కీర్తీ సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది.

ఒక్క అఖిల్ సినిమా తప్ప మిగతా రెండు సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి.

దీంతో సోషల్ మీడియాలో జనాలు మీమ్స్ తో అఖిల్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇద్దరు హీరోలు హిట్ కొట్టినా.మా దేవుడు మాత్రం హిట్ కొట్టలేకపోయాడంటూ సటైర్లు వేస్తున్నారు.

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!