Bigg Boss 7: వార్ని..అప్పుడే ప్రకటనలు కూడా పీకేసుకున్నారా ? ఇంకా బిగ్ బాస్ నీ ఎవరు కాపాడతారు
TeluguStop.com
బిగ్ బాస్ ఏడవ సీజన్( Bigg Boss 7 ) ప్రస్తుతం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే ఏ సీజన్ జరగాలన్న, ఎలాంటి రియాలిటీ షో ముందుకు వెళ్లాలన్న అందుకు సంబంధించిన కొన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటారు.
ఒక షోకి సంబంధించిన టిఆర్పి రేటింగ్( TRP Rating ) బట్టి ఆ షో కి డిమాండ్ కూడా ఉంటుంది.
ఇలా డిమాండ్ వస్తుంది అని భావించే కొన్ని షోలకి బ్రాండ్స్ మరియు డిజిటల్ ఎండార్స్మెంట్స్ ముందే మాట్లాడుకొని పెట్టుకుంటారు.
వాటిని షోలో పలుచోట్ల ఎండార్స్ చేసి వారికి రావాల్సినంత ప్రమోషన్ ఇచ్చే విధంగా షో మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
బిగ్ బాస్ విషయంలోనూ ఇదే జరిగింది.బిగ్ బాస్ అతి పెద్ద రియాలిటీ షో కాబట్టి కోట్లల్లో ఎండార్స్మెంట్ జరిగిపోయాయి.
"""/" /
షో ప్రారంభమవ్వడానికి ముందే ఈ యాడ్స్ అన్ని కూడా సిద్ధమైపోయి డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా పూర్తయిపోతూ ఉంటుంది.
అలా అయిన తర్వాతనే షో విడుదల చేస్తారు.కానీ ఒక్కసారి విడుదల చేశాక ఆ షో పూర్తి అయ్యే వరకు కూడా ఆ ఎండార్స్మెంట్( Endorsement ) కొనసాగుతూనే ఉంటుంది.
ఇప్పటి వరకు బిగ్ బాస్ 6 సీజన్లను పూర్తి చేసుకోగా గత ఆరు సీజన్లకు కూడా ఇదే తరహాలో బ్రాండ్స్ మరియు యాడ్స్ ఎండార్స్ చేయబడ్డాయి.
కానీ ఈసారి ఉల్టా పల్టా అనే పేరుతో రావడమో లేదంటే మరే కారణమో తెలియదు కానీ ఎండార్స్మెంట్స్ మధ్యలోనే వెనుతిరిగి వెళ్ళిపోతున్నాయి.
అందువల్ల ఎడిటర్ కు పని ఎక్కువై పోయి ప్రతి అడ్వర్టైజ్మెంట్( Advertisement ) కనిపించిన చోట బ్లర్ చేయాల్సిన పరిస్థితికి దిగజారి పోయారు.
"""/" /
గత నాలుగు రోజుల్లో రెండు ఎపిసోడ్స్ బ్రాండ్స్( Brands ) అన్నీ కూడా బ్లర్ లోనే ఉంచి షో విడుదల చేయగా నిన్నటికి నిన్న ఒక టాస్క్ ను కూడా ఇదే విధంగా చేయాల్సి రావడం నిజంగా బాధ పడాల్సిన విషయమే.
ఎందుకంటే ఒక షోకి బ్రాండ్ ఇస్తున్నాము అని చెప్పగానే దానికి సంబంధించిన టాస్కులు కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి.
ఒకసారి టాస్కులు మొదలు పెట్టాక వాటిని బ్లర్ చేయడం అంటే ఆ బ్రాండ్ వారు బిగ్ బాస్( Bigg Boss ) నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే అర్థం.
మరి షో ప్రారంభం అయ్యి నాలుగు వారాలు గడవక ముందే బ్రాండ్స్ వెళ్లిపోతున్నాయి అంటే బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ అంత దారుణంగా ఉందా లేక ఇంకేదైనా మతలబు ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.
4 మందారం పువ్వులతో ఇలా చేశారంటే నెల రోజుల్లో మీ జుట్టు అవుతుంది డబుల్..!