వరుస ఫ్లాపులతో విమర్శల పాలవుతున్న రవితేజ.. దర్శకులను గుడ్డిగా నమ్మేస్తున్నారా?
TeluguStop.com
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja) గురించి అందరికీ తెలిసిందే.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ.
ప్రస్తుతం రవితేజ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.కానీ ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో రవితేజ నటించిన సినిమాలలో క్రాక్, ధమాకా సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సరైన సినిమా ఒక్కటీ కూడా లేదు.
"""/" /
అలాగే ధమాకా( Dhamaka) సూపర్ హిట్ తర్వాత రవితేజ ఎంపికపై స్వంత అభిమానుల్లోనే తీవ్ర అసంతృప్తి రేగుతోంది.
కథల ఎంపికలో చేస్తున్న తొందరపాటుకి తాము బాధ పడుతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఏకంగా ఓపెన్ లెటర్లు రాస్తున్నారు అభిమాణులు.
కొందరు రవితేజ అభిమానులు ఆయనపై మండి పడుతున్నారు.మాస్ మహారాజా మీద గతంలో ఇలాంటి నిరసన స్వరాలు వినిపించిన దాఖలాలు కూడా చాలా తక్కువ.
ఇక్కడ తప్పు హీరోగా తనదా లేక వాడుకోలేకపోతున్న దర్శకులదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి.
అలాగే రవితేజ కేవలం మాస్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం కూడా ఒకరకంగా మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు.
ఈమధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలు అన్ని కూడా మాస్ సినిమాలే కావడం విశేషం.
"""/" /
ఇక అమర్ అక్బర్ ఆంటోనీ, టచ్ చేసి చూడు లాంటివి ఆయన స్వయంకృతాపరాధాల కిందకే వస్తాయి.
చదివినా ఫ్లాప్ అనిపించే స్టోరీలవి.తర్వాతే జాగ్రత్త పడటం మొదలైంది కానీ ఫలితాలు మాత్రం మారడం లేదు.
అవే ఫలితాలు రిపీట్ అవుతూనే ఉన్నాయి.మిస్టర్ బచ్చన్ లో హరీష్ శంకర్ చేసిన మార్పుల గురించి సీనియర్ హీరోగా రవితేజ కొంచెం సీరియస్ గా విశ్లేషణ చేసుకుని ఉంటే అవుట్ ఫుట్ మరోలా వచ్చేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు హిందీ పాటల కత్తిరింపు అవసరం ఉండేది కాదు.సామజవరగమన రైటర్లలో ఒకడైన భాను భోగవరపుతో చేస్తున్న ఎంటర్ టైనరైనా అభిమానుల ఆకలి తీరుస్తుందేమో చూడాలి మరి.
అయితే ఇదంతా రవితేజ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదా లేక దర్శకులు రవితేజను సరిగా వాడుకోవడం లేదా, లేక రవితేజ దర్శకులను గుడ్డిగా నమ్మేస్తున్నారా లాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
హీరోయిన్ ను అడ్డు పెట్టుకుని బన్నీపై సెటైర్లు వేసిన ప్రముఖ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?