అఖండలో బాలయ్య విగ్గు కోసమే అంత ఖర్చు చేశారట!

నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా 'అఖండ'.

ఈ సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకు పోతుంది.చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర హౌస్ ఫుల్ తో థియేటర్స్ కళకళ లాడుతున్నాయి.

ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పై పాజిటివ్ టాక్ వచ్చింది.

అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

ఇక నందమూరి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అఖండ విజయం అవ్వడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా టీమ్ అందరికి అభినందనలు చెప్పారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించాడు.బోయపాటి శ్రీను బాలయ్యను ఎప్పటికప్పుడు కొత్తగా అందంగా ప్రెసెంట్ చేస్తాడు.

ఈయన చూపించినంత అందంగా మరే డైరెక్టర్ చూపించడనే చెప్పాలి.బోయపాటి, బాలయ్య కాంబోలో వచ్చిన మూడు సినిమాల్లో కూడా బాలయ్య అందగానే కనిపించి ఫ్యాన్స్ సంతోష పడేలా చేసాడు.

"""/"/ ఇక తాజా సమాచారం ప్రకారం అఖండ సినిమాలో బాలయ్య అంత అందంగా కనిపించడం వెనుక విగ్గు కూడా ఒక కారణమట.

ఈ సినిమాలో బాలయ్య విగ్గు కోసమే నిర్మాతలు లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం.

ఈ సినిమాలో బాలయ్య విగ్గుకి ఏకంగా 50 లక్షల రూపాయలను ఖర్చు చేశారట.

39 లక్షలను ఖర్చు చేసి మూడువిగ్గులను కొనుగోలు చేశారట మేకర్స్. """/"/ ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్రకు ఈ మూడు విగ్గులను ఉపయోగించారని సమాచారం.

అంతేకాదు బాలయ్య లుక్ కోసం హెయిర్ స్పెసలిస్ట్ ను నియమించారట.ముంబైకు చెందిన స్పెసలిస్ట్ కు రెమ్యునరేషన్ గా 12లక్షల రూపాయలను చెల్లించారని సమాచారం.

మొత్తానికి అఖండలో బాలయ్య విగ్గుల కోసమే 50 లక్షలను ఖర్చు చేసారని తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఈ ఖర్చులేమి పెద్ద లెక్కకాదు అనే చెప్పాలి.

దారుణం.. తన చెల్లికి రైలులో ఎదురైనా అనుభవానికి ఓ అన్న ఆవేదన. .. పోస్ట్ వైరల్..!