ఈ రేసులో ఎవరు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారు ఎవరు ది బెస్ట్ గా నిలుస్తారు అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
జూలై నెల కాంపిటీషన్ లో పలువురు స్టార్ దర్శకులు సైతం పోటీకి దిగుతున్నారు.
అయితే కొందరి దర్శకులకు వారి సినిమాలు సక్సెస్ అందుకోవడం అనేది చాలా చాలా అవసరం.
ముఖ్యంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మారుతి.ఆయన ప్రీవియస్ చిత్రం `మంచి రోజులొచ్చాయి' ఆశించిన అంచనాలను అస్సలు అందుకోలేదు.
అందుకే ఆయన ఆశలన్నీ తన తాజా సినిమా `పక్కా కమర్షియల్` పైనే పెట్టుకున్నారు.
గోపీచంద్, రాశి కన్నా కాంబోలో వస్తున్న ఈ సినిమా జూలై 1న విడుదల కాబోతుంది.
ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొనగా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
ఈ సినిమాలో సత్యరాజ్ స్పెషల్ ఎఫెక్ట్. """/" /
H3 Class=subheader-styleవిక్రమ్ కె కుమార్: /h3pవిక్రమ్ కె.
కుమార్ కూడా జూలై రేసులో ఉన్నారు.`ఇష్క్, `మనం` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ , ఆ తర్వాత `హలో` , `గ్యాంగ్ లీడర్` సినిమాలు నిరాశ పరచడంతో బాగా ఢీలా పడ్డారు.
కాగా ఇపుడు ఈయన ఆశలన్ని జూలై 8న రిలీజ్ అయ్యే తన తాజా సినిమా `థాంక్ యూ` పైనే పెట్టుకున్నారు.
నాగ చైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.
"""/" /
H3 Class=subheader-styleచందు మొండేటి: /h3pఇక జులై రేసుకు రెడీగా ఉన్న మరో దర్శకుడు చందు మొండేటి.
`కార్తికేయ` `ప్రేమమ్` వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ డైరెక్టర్ ఆ తరవాత `సవ్యసాచి` `బ్లడీ మేరీ` చిత్రాలతో కాస్త వెనుకబడ్డారు.
కాగా ఇపుడు జూలై 22న విడుదలకు సిద్దంగా ఉన్న తన తాజా సినిమా `కార్తికేయ 2` పైనే గురి పెట్టుకోగా ఇది ఎలాంటి ఫలితం అందిస్తుంది అన్నది చూడాలి.
ఈ చిత్రంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కనిపించనున్నారు. """/" /
H3 Class=subheader-styleలింగుస్వామి:/h3p ఇక జూలై రేస్ లో జోరు చూపించడానికి సిద్దంగా ఉన్న మరో దర్శకుడు ఎన్.
లింగుస్వామి.అయితే ఈ మధ్య ఈ డైరెక్టర్ నుండి వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
దాంతో ఇపుడు ఆయన టార్గెట్ ఆయన తాజా చిత్రం 'ద వారియర్` పైనే పెట్టుకున్నాడు.
ఎలాగైనా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్ళీ సక్సెస్ బాట పట్టాలని యోచిస్తున్నారు.
ఇలా.జూలై రేసులో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నారు మారుతి, విక్రమ్, లింగుస్వామి, చందు మొండేటి దర్శకులు.
మరి ఎవరి ఏ విధమైన ఫలితాన్ని అందుకుంటారు అన్నది వేచి చూడాలి.
సమంత పెట్ డాగ్ తో శోభిత ధూళిపాళ్ల.. సామ్ అభిమానుల రియాక్షన్ ఇదే!