కోదాడ మార్కెట్ కొత్త పాలకవర్గం కొలువుదీరేదెన్నడు..?

సూర్యాపేట జిల్లా:కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ( Kodada Agricultural Market Committee ) పాలకవర్గం గడువు 2022 సెప్టెంబర్ నెలలో ముగిసింది.

దాదాపు 20 నెలలుకు పైగా పాలకవర్గం లేకుండానే మార్కెట్ లావాదేవీలు నడవడంతో రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారకుముందే పాత కమిటి గడువు ముగిసినా కొత్త కమిటీని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు.

ఈ లోపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పాలకవర్గం నియామకంలో జాప్యం ఏర్పడింది.

ప్రస్తుతం ప్రభుత్వం మారినా పరిస్థితి అలాగే ఉందని,దీనితో రైతులకు మెరుగైన సేవలు అందడం లేదని వాపోతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని నేపథ్యంలో రైతులకు( Farmers ) అండగా మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించగా అనంతగిరి మండలం లక్కవరం గ్రామానికి చెందిన బుర్ర సుధారాణి చైర్మన్ గా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగారు.

ఈ సారి చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించారు.మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక చేయడానికి నియోజకవర్గంలో సరైన ఎస్సీ మహిళా నాయకురాలే కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ మార్కెట్ కమిటీకి పాలకవర్గం నియమించడం ద్వారా కోదాడ పట్టణం,కోదాడ రూరల్, మునగాల,నడిగూడెం,చిలుకూరు మండలాల రైతులకు లబ్ధి చేకూరనున్నది.

దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకవర్గం పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.ఎమ్మెల్యే తర్వాత ప్రొటోకాల్ హోదా కలిగిన పదవి మార్కెట్ కమిటీ చైర్మన్ కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠంపై ఆశావాహుల కన్ను పడింది.

గతంలో పాలకవర్గం ఏడాది కాలానికే ఉండేది.తర్వాత ఆరు నెలల చొప్పున రెండు దఫాలు పొడిగించే అవకాశం ఉండేది.

కొత్త నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.ఆరు నెలల చొప్పున గరిష్ఠంగా రెండు పర్యాయాలు గడువు పొడిగించే అవకాశం యధావిధిగా ఉంటుంది.

తాజా నిబంధనల ప్రకారం మార్కెట్ పాలకవర్గం మూడేళ్ళు గరిష్ఠంగా పదవిలో కొనసాగవచ్చు.పదేళ్ల తర్వాత కోదాడ మార్కెట్ కమిటీ హస్తం ఖాతాలోకి రానుంది.

దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసిన కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి.తమకు ప్రాధాన్య ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్ పర్సన్ చైర్మన్ గా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మార్కెట్ కమిటీ కార్యదర్శి అశోక్ తెలిపారు.

ఈ దఫా ఎస్సీ మహిళ చైర్ పర్సన్ ను నియమించాల్సి ఉందన్నారు.

అంబానీ నుంచి జయలలిత వరకు గొప్పగా పెళ్లిళ్లు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు