టాలీవుడ్ నుంబర్ వన్ హీరో అయ్యే సామర్థ్యం ఈ హీరోల్లో ఎవరికీ ఉంది ?
TeluguStop.com
తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు హీరోలు టాప్ లో కొనసాగుతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ 3లో ఉన్నారు.
ఈ ముగ్గురు హీరోలు సైతం మంచి సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్.
చిరంజీవి అల్లుడిగా, అల్లు రామలింగయ్య మనువడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
కుటుంబ నేపథ్యం ఉన్నా.ఎంతో కష్టపడి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.
కష్టనష్టాలను ఎదుర్కొని టాప్ హీరోల స్థాయికి చేరుకున్నారు.ఇప్పుడు వీరి వారసులు కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.
మహేష్ కొడుకు 1 నేనొక్కడినే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాడు.బన్నీ కొడుకు కూడా చిన్న చిన్న వీడియోల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
ఆయన కూతరులు శాకుంతలం సినిమాలో నటించింది.ఎన్టీఆర్ కొడుకులు మాత్రం పెద్దగా బయట కనిపించరు.
సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు.ఎన్టీఆర్ వారిని బయటి ప్రపంచానికి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఈ ముగ్గురు హీరోల్లో ముందుగా సినిమాల్లోకి అడుగు పెట్టేది మహేష్ కుమారుడు గౌతమ్ అనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఆయన ఓ సినిమాలో కూడా నటించాడు.అలాగే మహేష్ బాబు లాగే చక్కటి అందంతో పాటు ఎత్తు ఉన్నాడు.
బన్నీ పిల్లలు ఇప్పుడు చిన్నవారే కాడవంతో ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఎన్టీఆర్ పిల్లలు ఇంకా చిన్నవాళ్లు.అందుకే ఆయన తన పిల్లలను బయటకు ఫోకస్ కానివ్వడం లేదు.
"""/"/
ఈ ముగురు హీరోల పిల్లలు సినిమాల్లో అడుగు పెట్టే అవకావం ఉంది.
మహేష్, అల్లు అర్జున్ పిల్లలు ఇప్పటికే యాక్టింగ్ పట్ల మంచి అవగాహణ ఉంది.
వారు సినిమాల్లో రాణించడం ఖాయంగా కనిపిస్తుంది.అటు ఎన్టీఆర్ పిల్లలు మాత్రం ఇప్పటికీ బయటకు తెలియదు.
వీరు కూడా పెద్దయ్యాక సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా ఈ కుటుంబాల నుంచి మరో తరం నటులు కూడా తయారు అవుతున్నారు.
ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!