వీరందరూ పేరున్న సెలబ్రిటీలే.. కానీ తెర వెనుక నీచులు..??
TeluguStop.com
తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు.కొందరు సినిమాల ద్వారా పాపులరైతే మరి కొంతమంది యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యారు.
పెద్ద పెద్ద దానాలు చేయడం, లేదంటే కామెడీ చేసి నవ్వించడం ద్వారా సోషల్ మీడియా యూజర్లకు దగ్గరయ్యారు.
అయితే ఇలాంటి సెలబ్రిటీలలో కొందరు నీచులు కూడా ఉంటారు.తెర వెనుక వారు చేసే అరాచకాలు, అఘాయిత్యాలు, బాగోతాలు ఏదో ఒక రోజున బయటపడక తప్పవు.
అలాంటి రోజులు ఇటీవల కాలంలోనే చాలామంది సెలబ్రిటీలకు వచ్చాయి.వారు ఎవరో, వారి మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయో తెలుసుకుందాం.
H3 Class=subheader-style• ఫన్ బకెట్ భార్గవ్/h3p
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చిప్పాడ భార్గవ్ అలియాస్ 'ఫన్ బకెట్ భార్గవ్'( Fun Bucket Bhargav ) ఓ మైనర్‌ను అత్యాచారం చేసి ఆమెను ప్రెగ్నెంట్ చేసినట్లు సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, భార్గవ్ సోషల్ మీడియాలో కొన్ని ఆఫర్లు ఇస్తానని వారి అమ్మాయిని సంప్రదించాడు.
ఆపై ఆ బాలికను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని జైల్లో కూడా వేశారు.
"""/" /
H3 Class=subheader-style• బన్నీ వాస్/h3p
నిర్మాత బన్నీ వాస్( Producer Bunny Vas ) తనను లైంగికంగా వేధించాడంటూ సునీత బోయ అనే నటి సెన్సేషనల్ అలిగేషన్స్ చేసింది.
సినిమా ఆఫర్లు ఇప్పిస్తానని బన్నీ వాస్ తనను వాడుకున్నాడని ఆరోపించింది.ఆ తర్వాత తనని బన్నీ వాసు ఏమీ చేయలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ క్లారిటీ ఇచ్చింది.
దీనిపై బన్నీ వాస్ కూడా స్పందించాడు.ఏవైనా అవకాశాలు ఉంటే ఆమెకు ఛాన్స్ ఇస్తామని పేర్కొన్నాడు.
మంచి మెంటల్ కండిషన్‌తో వస్తే అడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ కావచ్చని చెప్పారు. """/" /
H3 Class=subheader-style• రాజ్ తరుణ్/h3p
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనని మోసం చేశాడని అతని తన మాజీ ప్రియురాలు లావణ్య కేసు పెట్టింది.
దాంతో అందరూ షాక్ అయ్యారు.వీరి ఆడియో కాల్స్ లీక్ అయ్యాయి.
వీళ్ల వ్యవహారం చాలా రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.దీనివల్ల రాజ్ తరుణ్ ఇమేజ్ బాగా దెబ్బతిన్నది.
అంతేకాదు, యాక్టర్ రాజ్ తరుణ్‌పై ఛార్జిషీట్ దాఖలైంది.ఈ కేసులో ఏమని తీర్పు ఇస్తారో చూడాలి.
"""/" /
H3 Class=subheader-style• కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్/h3p
ఇటీవల జానీ మాస్టర్( Jani Master ) తన లేడీ అసిస్టెంట్‌పై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
బాధితురాలు తాను మైనర్‌గా ఉన్నప్పుడే జానీ అత్యాచారం చేశాడని ఆరోపించింది.దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇటీవల నేషనల్ అవార్డు అందుకోవడానికి అతనికి మధ్యంతరం బెయిల్ ఇచ్చారు.అయితే నేషనల్ అవార్డు అతనికి ఇవ్వకూడదని బోర్డు నిర్ణయించింది.
అతను దోషి కాదని తెలిస్తే అవార్డు ఇచ్చే ఆస్కారం ఉంది. """/" /
H3 Class=subheader-style• హర్ష సాయి/h3p
ముంబైకి చెందిన నటి యూట్యూబర్ హర్ష సాయి( Youtuber Harsha Sai ) నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని మోసం చేశాడని కేసు పెట్టింది.
ఈ 25 ఏళ్ల నటి ఓ రియాలిటీ షోలో కనిపించింది.సంవత్సరం క్రితం విడుదలైన ఓ చిత్రంలో హర్ష సాయితో కలిసి రొమాన్స్ చేసింది.
అయితే ఈమె ఆరోపణలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.తప్పు చేస్తే ఇతనికి కఠిన శిక్ష పడాల్సిందే అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.