ఐశ్వర్య ఇంట అడుగుపెడితే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నాశనం..?
TeluguStop.com
మాజీ మిస్ వరల్డ్ విన్నర్ ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ముద్దుగుమ్మ ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.
ఈ బ్యూటీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి ( Amitabh Bachchan ) కోడలు అయింది.
ఆమె అభిషేక్ బచ్చన్ ను పెళ్ళాడింది.ఐశ్వర్య మొదట సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపింది.
తర్వాత అతడు కొడుతున్నాడని, బూతులు మాట్లాడుతున్నాడని వదిలేసింది.2005లో యాక్టర్ వివేక్ ఒబెరాయ్‌తో అఫైర్ పెట్టుకుంది.
అతడితో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది.చివరికి అభిషేక్ బచ్చన్ తో( Abhishek Bachchan ) ప్రేమలో పడింది.
ధూమ్ 2 షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. """/" /
వారి నిశ్చితార్థం 2007, జనవరి 14న జరిగింది.
అమితాబ్ బచ్చన్ ఈ శుభవార్తను చెప్పారు.అయితే అదే సమయంలో ఒకరు అమితాబ్ బచ్చన్‌కి షాకింగ్ లెటర్ రాశారు.
అందులో ఏం రాశారంటే "ఐశ్వర్య రాయ్ మీ ఇంటికి వస్తే మీరు సర్వనాశనం అవుతారు.
" అని రాశారు.ఈ లెటర్ బచ్చన్ ఫ్యామిలీలో కొంత ఆందోళన కలిగించింది.
బాలీవుడ్ మీడియా దీని గురించి చాలా భయానకంగా, ఐశ్వర్య రాయ్ అంటేనే ప్రజల్లో భయం కలిగించే లాగా ప్రచారాలు మొదలుపెట్టింది.
ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. """/" /
రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) మాట్లాడుతూ "మీడియా అమితాబ్ బచ్చన్ వర్రీడ్ ఫేస్‌ను, నవ్వుతున్న ఐశ్వర్యరాయ్ ఫోటోను దగ్గర పెట్టి స్మశానంలో పూజలు చేసినట్లు చూపించారు.
పూజల ద్వారా ఐశ్వర్య నెగటివిటీని తొలగించినట్లు ఒక మంత్రగాడు యాక్ట్ చేశాడు.ఇదంతా చూస్తుంటే నాకే చాలా భయంగా అనిపించింది.
ఇది చాలా నిజమేమో అని ప్రజలు కూడా అనుకున్నారు ఇందులో ఎమోషన్ తప్ప లాజిక్ లేదు.
ఆ ఎమోషన్ అనేది చాలా మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఐశ్వర్య బచ్చన్ ఫ్యామిలీని నాశనం చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు" అని అన్నారు.
అయితే అమితాబ్ బచ్చన్ ఈ లెటర్ ను పట్టించుకోలేదు.ఈ రూమర్స్ ని ఖండించారు.
అంతేకాకుండా తన కుమారుడిని ఐశ్వర్య రాయ్ కి ఇచ్చి పెళ్లి చేశారు.ఈ జంట 20 ఏప్రిల్ 2007న సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
సెల్ఫీ పిచ్చితో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి.. చివరకి?