అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి?
TeluguStop.com
![అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి?](https://telugustop.com/wp-content/uploads/2022/02/ashwamedha-yagam-horse-Male-horse-sun.jpg)
అశ్వమేధ యాగం గురించి మనం రామాయణంలో విన్నాం.లవ కుశులు పుట్టాక శ్రీ రామ చంద్రుడు ఈ అశ్వమేధ యాగాన్ని చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/telugustop-story-brand-logo1.png)
![అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి?](https://telugustop.com/wp-content/uploads/2022/02/ashwamedha-yagam-horse-Male-horse-sun.jpg)
ఈ యాగానికి వాడిన గుర్రాన్నే లవ కుశులు ఆపారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/telugustop-story-brand-logo1.png)
![అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి?](https://telugustop.com/wp-content/uploads/2022/02/ashwamedha-yagam-horse-Male-horse-sun.jpg)
అయితే ఈ అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి.
ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం.
అలాగే తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ఈ అశ్వమేధ యాగాన్ని చేస్తుంటారు.
ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు.
ముందుగా గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.ఆ తర్వాత ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు.
ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ.ఒక్క కుక్కను చంపి సంకేతంగా శిక్షను తెలియజేస్తారు.
ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సర కాలం యధేచ్చగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు.
ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు.అశ్వం శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు.
గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందుల నుండి కాపాడటానికి తోడుగా రాజ కుమారులు లేదా సేనాధిపతులు ఉంటారు.
నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞ యాగాదులు జరుపుతారు.
మిస్ యూ మై సన్.. ప్రముఖ కమెడియన్ గీతా సింగ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!