ఉసిరి ఆరోగ్యానికి మంచిదే, కానీ వారు అస్స‌లు తిన‌రాద‌ట‌!

ఉసిరి కాయ‌లు.వీటి గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.

ప్ర‌స్తుత ఈ చ‌లి కాలంలో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే ఉసిరి కాయ‌ల్లో విట‌మిన్‌ ఎ, విమ‌టిన్ సి, విట‌మిన్ బి, పొటాషియం, కాప‌ర్‌, మ్యాంగ‌నీస్‌, ప్రోటీన్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా ఉసిరి కాయ‌లు బోలెడ‌న్ని బెనిఫిట్స్‌ను అందిస్తాయి.అయితే ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ ఉసిరి కాయ‌ల‌ను కొంద‌రు తిన‌రాదు.

ఆ కొంద‌రు ఎవ‌రు వారు ఎందుకు తిన‌రాదు వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీ స్టోన్స్ లేదా ఇత‌ర కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డే వారు ఉసిరి కాయ‌ల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఎందుకంటే, ఉసిరిని తీసుకోవ‌డం వ‌ల్ల‌ శరీరంలో సోడియం స్థాయి పెరిగిపోయి.కిడ్నీ స‌మ‌స్య‌లు తీవ్ర త‌రంగా మార‌తాయి.

"""/"/ డ్రై స్కిన్ క‌ల‌వారు ఉసిరి కాయ‌ల‌ను ఎవైడ్ చేయ‌డ‌మే మంచిది.ఉసిరి కాయాల్లో ఉండే కొన్ని ల‌క్ష‌ణాలు శ‌రీరంలోని నీటి శాతాన్ని త‌గ్గించేసి చ‌ర్మాన్ని పొడి బారేలా చేస్తాయి.

అందు వ‌ల్లనే డ్రై స్కిన్ వారు ఉసిరిని తీసుకోరాదు. """/"/ అలాగే లోబీపీతో తిప్ప‌లు ప‌డే వారు ఉసిరి కాయ‌ల‌ను తీసుకుంటే.

ర‌క్త పోటు స్థాయిలు మ‌రింత దిగ‌జారి పోతాయి.కాబ‌ట్టి, లోబీపీ బాధితులు కూడా ఉసిరిని తీసుకోరాదు.

జ‌లుబు చేసిన‌ప్పుడూ ఉసిరి కాయ‌ల‌ను తీసుకోరాదు.ఉసిరి కాయ‌ల‌కు స‌హ‌జంగా చ‌లువ చేసే గుణం ఉంది.

అందు వ‌ల్ల‌, జలుబు స‌మ‌యంలో ఉసిరి కాయ‌ల‌ను తీసుకుంటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది.

ఇక కాలేయ వ్యాధులు ఉన్న వారు, మ‌ల‌బ‌ద్ధ‌కంతో ఇబ్బంది ప‌డే వారు, త‌ర‌చూ డీహైడ్రేష‌న్‌కి గురైయ్యే వారు కూడా ఉసిరి కాయ‌ల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!