100 కోట్ల కలెక్షన్స్ వస్తేనే సినిమా హిట్టని ఎవరు చెప్పారు: దుల్కర్ సల్మాన్

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు దుల్కర్ సల్మాన్ ( Dulquer Salman ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు.

సీతారామం సినిమా( Sitaramam ) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు తెలుగులో కూడా విపరీతమైనటువంటి అభిమానులు పెరిగిపోయారు.

అందుకే ఈయన నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఈ క్రమంలోనే దుల్కర్ తాజాగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త ( King Of Kotha )అనే సినిమా ఈనెల 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

"""/" / ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సినిమాల గురించి సినిమాలు రాబట్టే కలెక్షన్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమా 100 కోట్ల కలెక్షన్స్ రాబడితేనే సూపర్ హిట్ అంటూ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా పై నటుడు దుల్కర్ స్పందిస్తూ ఒక సినిమా 100 కోట్ల సాధిస్తేనే హిట్ అని అనుకుంటే పొరపాటున తెలిపారు.

"""/" / ఇలా ఒక సినిమా 100 కోట్లు సాధిస్తే హిట్ అని అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడితే సూపర్ హిట్ అని ఎవరు నిర్ణయిస్తారో నాకు అర్థం కావడం లేదని ఈయన తెలియజేశారు.

అది ప్రామాణికంగా ఎలా మారిందో తెలియదు.బాక్సాఫీస్‌ నంబర్‌ గేమ్‌ అనేది హాస్యాస్పదంగా ఉంది.

అలాగే ఒక సినిమా ఈ మ్యాజిక్ నెంబర్ను తాకనప్పుడు ఆ సినిమా పొందిన ప్రేమను మనం ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదని ఈయన తెలియజేశారు.

కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాలు కూడా పరాజయం కావచ్చు అదే విధంగా చిన్న హీరోలు నటించిన సినిమాలు కూడా సూపర్ సక్సెస్ కావచ్చువీటన్నింటినీ కూడా మనం విజయాలు గానే స్వీకరించాలి అంటూ ఈ సందర్భంగా దుల్కర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కురుల ఆరోగ్యాన్ని పెంచే కాఫీ.. ఎలా వాడాలో తెలుసా?