Nandita Swetha : RX100 సినిమాకు నో చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో కొన్ని కథలు నచ్చినా కొంత మంది హీరోయిన్లు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.

కొన్ని బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటే కొంత మంది హీరోయిన్లు వెంటనే నో చెప్పేస్తారు.

ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ సీన్ చేస్తే నన్ను యాక్సెప్ట్ చేతారో లేదో అని ఎన్నో భయాలు పెట్టుకుంటారు.

ఇలానే ఒక హీరోయిన్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుంది.ఇంతకి ఆ సినిమా ఏంటి, ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

"""/" / RX 100 ఈ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించగా, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) నటించింది.

ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.బోల్డ్ క్యారెక్టర్ చేస్తూ, ప్రేమించిన అబ్బాయిని మోసం చేసిన క్యారెక్టర్ లో పాయల్ జీవించేసింది.

ఈ సినిమాలో పాయల్ తన నటనతో మరింత ఫాలోయింగ్ ని పెంచుకుంది.అయితే ఈ క్యారెక్టర్ ను ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారు.

ఆమెనే నందిత శ్వేత. """/" / నందిత శ్వేత( Nandita Swetha ) ఆచితూచి సినిమాలను చేస్తుంది.

సినిమాలో క్యారెక్టర్ బాగుంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది.నందిత శ్వేత తాజాగా నటించిన చిత్రం హిడింబి( Hidimba ).

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను షేర్ చేసుకుంది.

ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమా RX 100 సినిమాలో ఛాన్స్ ని మిస్ చేసుకున్నాను అని ఓపెన్ గా చెప్పింది.

ఈ సినిమాలో మొదట నందిత శ్వేతని అనుకున్నారు.కానీ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో జనాలు ఏమనుకుంటారో.

నెక్స్ట్ ఎలాంటి పాత్రలు వస్తాయో అన్న భయంతో ఈ సినిమాను మిస్ చేసుకుందట.

అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్న అని భాద పడ్డాను అని చెప్పింది.

కథ మొత్తం నచ్చినా కొన్ని బోల్డ్ సీన్స్ వల్ల ఒక మంచి సినిమాని మిస్ చేసుకుంది నందితా శ్వేత.