బ్లాక్ బస్టర్ హిట్ వెంకీ సినిమాని కోల్పోయిన ఇద్దరు యాక్టర్స్.. ఎవరంటే.. ?

20 ఏళ్ల క్రితం వచ్చిన కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ వెంకీ (2004)( Venky Movie ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇందులోని కామెడీ అద్భుతంగా ఉంటుంది.ఇప్పటికీ ఆ కామెడీ చూస్తూ నవ్వుకునే ప్రేక్షకులు ఉన్నారు.

పాటలు కూడా ఉర్రూతలూగిస్తాయి.శ్రీను వైట్ల( Srinu Vaitla ) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రవితేజ,( Ravi Teja ) స్నేహ, అశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే అతి కొద్ది సినిమాల్లో ఇది కూడా ఒకటి.

అయితే ఇంత మంచి సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని ఇద్దరు యాక్టర్లు కోల్పోయారు.వారెవరో తెలుసుకుందాం.

"""/" / దాని కంటే ముందు ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలి.

దాని వల్లనే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.నిజానికి ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ పెట్టాలని ముందుగా ఎవరనుకోలేదు.

ఒకరోజు షూటింగ్ పూర్తిచేసుకుని రిటర్న్ అవుతుండగా మూవీ టీం అంతాక్షరి ఆడింది.అయితే ఈ వినోదాన్ని చూసి శ్రీను వైట్ల ఇది ఏదో బాగుందే, దీన్ని సినిమాలో యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నారు.

ఇతర మూవీ టీమ్‌ మెంబర్స్ కూడా ఆయన ఆలోచనతో అంగీకరించారు.దాంతో ఈ ట్రైన్ సీక్వెన్స్ ను బాగా డెవలప్ చేసి మంచి కామెడీ యాడ్ చేసి సినిమాలో పెట్టారు.

"""/" / ఈ మూవీలో స్నేహకి( Sneha ) బదులు గజినీ ఫేమ్ ఆసిన్‌ను( Asin ) తీసుకోవాలని శ్రీను వైట్ల భావించారు.

కానీ ఎందుకో ఆమె నటించడానికి ఆసక్తి చూపించలేదు.ఆసిన్ ఈ సినిమాలో నటించక పోవడానికి గల కారణం కచ్చితంగా తెలియదు.

స్నేహ మాత్రం ఇందులో హీరోయిన్ రోల్ కు కరెక్ట్ గా సూట్ అయింది.

"గోంగూర తోట కాడ కాపు కాచు" పాటకు అద్భుతంగా డాన్స్ చేసి ఒక ఊపు ఊపేసింది.

ఆ విధంగా ఆసిన్‌ ఒక మంచి మూవీ పోగొట్టుకుంది.ఈ సినిమాని కోల్పోయిన మరొక యాక్టర్ ఎమ్ ఎస్ నారాయణ.

( MS Narayana ) ఈ కమెడియన్ ను ట్రైన్ సీక్వెన్స్ లో ఇంక్లూడ్ చేయాలని శ్రీను వైట్ల ఎంతో ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయ్యాడు.

ఒకవేళ ఎమ్మెస్ నారాయణను తీసుకొని ఉంటే ఈ కామెడీ ట్రాక్ మరింత పండి ఉండేది.

పుష్ప సినిమాని రిజెక్ట్ చేసిన ఆరుగురు యాక్టర్లు.. ఎవరంటే..?