రాజమౌళి ఈగ సినిమాలో ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?

రాజమౌళికి( Rajamouli ) సినిమా పిచ్చి ఉంది.అది మామూలు పిచ్చి కాదు అందుకే అతడిని పని రాక్షసుడు అంటారు.

ఆయన సినిమాలో నటించాలని కోరుకునే నటి నటులు ఎంతమంది ఉంటారో చెప్పక్కర్లేదు.కానీ అయన సినిమాలో నటిస్తున్న టైంలో వామ్మో ఏంట్రా బాబోయ్.

ఈ మనిషి అనుకునే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు.అంతలా ఒక వ్యక్తిలోనే నటనను పిండుకుంటాడు రాజమౌళి.

ఇందుకు తారక్ లాంటి నటులు కూడా అతీతం కాదు.తీసే ప్రతి పనిలో పర్ఫెక్షన్ కావాలనుకుంటాడు.

అందుకే అతనికి మరో పేరు జక్కన్న.ఇక జక్కన్న ఒక సినిమా మొదలుపెట్టాడు అంటే అది చెక్కుతూ చెక్కుతూ ఎప్పుడు విడుదల చేస్తాడో ఆయనకే తెలియదు.

అలా ఏళ్లకు ఏళ్ళు సినిమా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది.కానీ తీసిన ప్రతి సినిమా విజయవంతం అవుతుంది.

ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని వ్యక్తిగా టాలీవుడ్ లో మంచి రికార్డు సంపాదించుకున్నాడు రాజమౌళి.

"""/" / ఇక అసలు విషయంలోకి వెళితే రాజమౌళి ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఈగ.

( Eega Movie ) ఈ చిత్రం మొదటి ఆరు నెలలలో పూర్తి చేయాలనుకున్నప్పటికి దాదాపు రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకుంది.

అయితే మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా ? ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని ? ఆ .

ఎవరో ఒక డబ్బింగ్ ఆర్టిస్టు చెప్పి ఉంటాడు.దానిలో పెద్ద విశేషమేముంది అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది అసలు విషయం.

ఈగ పాత్రకు డబ్బింగ్( Dubbing ) చెప్పింది మరెవరో కాదు.అది మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళినే.

"""/" / అది కదా మ్యాటర్.అందుకే ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజమౌళి డబ్బింగ్( Rajamouli Dubbing ) చెప్పిన మొదటి మరియు చివరి సినిమా ఇదే అయి ఉంటుంది.

పైగా చాలా ఫన్నీగా డబ్బింగ్ చెప్పి సినిమాని రక్తి కట్టించాడు.ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక పై ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా గమనించండి.

ఈగ వాయిస్ ని బట్టి మీరే గుర్తు పడతారు.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రాలు రెడీనా ?