Bala Saravathi : నాటి తరం హీరోయిన్స్ మందు అలవాటు వెనక ఉన్న ఏకైక మహిళా ఈమె !

మహానటి సావిత్రి కి మందు అలవాటు ఉంది, అందువల్లే ఆమె పతనం చూసారు.

ఇందులో ఎలాంటి సందేహం లేదు.అప్పుడు లేదా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొన్ని పోకడలను అలవాటు చేసుకుంటూ ఉంటారు.

అయితే ఏ ఎలావాటు అయినా కూడా హద్దు మీరనంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఒక్కసారి అలవాటు కాస్త వ్యసనం అయితేనే ఎంత ఎత్తున ఉన్న కూడా పాతాళం వరకు విసిరి వేయబడతారు.

అందుకే సావిత్రి( Savitri ) సినిమా జీవితం లో ఎన్నో ఎత్తులను అలాగే, పతనాన్ని కూడా చూసింది.

ఒక్క సావిత్రి మాత్రమే కాదు అప్పటి తరం లో అందరి హీరోయిన్స్ కి మందు అలవాటు ఉండేది.

"""/" / కానీ కుటుంబం కోసం లేదా ఆరోగ్యం కోసం వారి పరిధి మేరకు ఎంటర్టైన్ చేసే వారు కానీ ఆ తర్వాత హద్దు మీరకుండా జీవితాన్ని సుఖంగా గడిపారు.

అయితే అప్పట్లో చాలా మందికి మందు అలవాటు చేసిన ఒక మహిళా గురించి చరిత్రలో ఎక్కడ ప్రస్తావించలేదు.

సావిత్రికి ఎదో ఎఫైర్ ఉందని, ఒక కమెడియన్ మరియు డైరెక్టర్ తో ఎల్లప్పుడూ మద్యం తాగుతూ పేకాట ఆడుతూ ఉండేదని అంటుంటారు కానీ చాల మందికి తెలియని విషయం ఏమిటి అంటే బాల సరస్వతి( Saraswati ) అనే సురభి కంపెనీ ఆర్టిస్ట్( Artist Of Surabhi Company ) కి ఉన్న మద్యం అలవాటే నటీమణులకు కూడా అలవాటై చివరికి సావిత్రిని బానిసను చేసింది.

"""/" / ఈ బాలసరస్వతి మొగ పాత్రలు ఎక్కువగా వేస్తూ ఉండేది.సురభి కంపెనీ లో పాటలు పాడుతూ బాగానే నటించేది.

అలాగే నాటి కమెడియన్ కస్తూరి శివరావు తో ఒక సినిమాలో కూడా నటించింది.

ఇక బాలసరస్వతి సావిత్రి కి ఎదురుగా ఉన్న ఎస్వీ రంగారావు ఇంటికే పక్క సందులో ఒక ఇంట్లో అద్దెకు దిగింది.

అక్కడే కూర్చొని ఎప్పుడు తాగుతూ ఉండేది.ఆలా ఆమెకు ఇండస్ట్రీ లో ఉంది కాబట్టి పరిచయాలు పెరిగాయి .

అవకాశాలు అయితే రాలేదు కానీ చాల మంది హీరోయిన్స్ ఆమెతో కలిసి కూర్చొని చిల్ అయ్యేవారు.

షూటింగ్ లేకపోతే చాలు ఆమెతో కూర్చొని సిట్టింగ్ పెట్టేవారు.అంజలి దేవి, సావిత్రి వంటి వారు ఆమె వేసే జోకులకు నవ్వుతు తాగేవారు.

కానీ అది సావిత్రి పాలిట శాపం అవుతుంది అనుకోలేదు.కానీ చాల మంది జెమినీ గణేశన్ వల్ల అలవాటు అయ్యింది అనుకుంటారు.

నిజానికి అయన మందు చాల చాల మితంగా తీసుకునే వారు.