జ్ఞాన్వాపి మసీదు. కాశీ విశ్వనాథ దేవాలయంలను ఎవరు నిర్మించారో తెలుసా?

ఇటివలి కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని బాబా కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్వాపి మసీదుల విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ రెండూ ఒకదానికొకటి పక్కపక్కనే ఉన్నాయి.ఈ దేవాలయాలు, మసీదులను ఎవరు కట్టారో మీకు తెలుసా? వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం, పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదు నిర్మాణం, పునర్నిర్మాణం గురించి ధృవీకరించబడిన సమాచారం లేదు, బీబీసీ నివేదిక ప్రకారం కొంతమంది చరిత్రకారులు 14వ శతాబ్దంలో విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చివేసి, జ్ఞాన్వాపి మసీదును జౌన్‌పూర్‌ షర్కీ సుల్తానులు నిర్మించారని చెబుతారు.

అయితే దీనికి సంబంధించిన ఆధారాలు లేవు.కాశీ విద్యాపీఠ్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజీవ్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం విశ్వనాథ ఆలయాన్ని అక్బర్ నవరత్నాలలో ఒకరైన తోడర్మల్ రాజు 1585లో దక్షిణ భారతదేశానికి చెందిన పండితుడు నారాయణ్ భట్ సహాయంతో నిర్మించాడు.

దీనికి చారిత్రక ఆధారాలు లేనప్పటికీ.జ్ఞాన్వాపి మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇనాజానియా మసాజిద్ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొహమ్మద్ యాసిన్ మాట్లాడుతూ మసీదు, ఆలయం రెండింటినీ అక్బర్ 1585 సంవత్సరంలో నిర్మించారని తెలిపారు.

యాసిన్ తెలిపిన వివరాల ప్రకారం, జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించిన మొదటి ప్రస్తావన 1883-84 నాటిది.

ఇది జమా మసీదు జ్ఞాన్వాపి అని రెవెన్యూ పత్రాలలో నమోదు అయ్యింది.యాసిన్ తెలిపిన వివరాల ప్రకారం మరుసటి సంవత్సరం అంటే 1937లో 1936లో దాఖలైన వ్యాజ్యంపై ఒక నిర్ణయం వచ్చింది, అందులో కోర్టు దానిని మసీదుగా అంగీకరించింది.

ఇది మసీదు అని, ఇది వక్ఫ్ ఆస్తి అని కోర్టు పేర్కొంది.తర్వాత హైకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది.

ఎన్టీఆర్ తల్లి, తండ్రి పుట్టినరోజు ఒకేరోజా.. ఇలా జరగడం ఆశ్చర్యమే అంటూ?