సీతారామన్ సినిమాని వదులుకున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
TeluguStop.com
సీతారామం.ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిందని చెప్పుకోవాలి.
ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న హాను రాఘవపూడికి ఆక్సిజన్ అందించింది ఈ సినిమా.ఇక దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ గా నటించారు.
ఇప్పటికే ఈ సినిమా 25 కోట్ల షేర్ రాబట్టగా రానున్న కాలంలో 30 కోట్లకు పైగా షేర్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాతో పాటు వచ్చిన బింబిసార కూడా మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ నడుస్తున్నప్పటికీ సీతారామన్ సినిమా ఒక మంచి క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచింది.
లై, పడి పడి లేచే మనసు వంటి రెండు ఫ్లాప్ చిత్రాలు ఇచ్చిన హను రాఘవపూడి కి ఈ సినిమా మంచి విజయాన్ని మాత్రమే కాదు మన టాలీవుడ్ దర్శకుల సత్తాను మరో మారి సౌత్ ఇండియా ముందు చూపిందనే చెప్పుకోవాలి.
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే ఈ రెండు సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్న ఎందుకు మరో మారు సీతారామం వంటి సినిమాను చేయడానికి మన టాలీవుడ్ హీరోలు ముందుకు రాలేదు.
"""/" /
మొదట ఈ సినిమాని అందరూ టాలీవుడ్ లో రిజెక్ట్ చేయగా దుల్కర్ సల్మాన్ మాత్రం కథ విన్న తర్వాత ఖచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
దుల్కర్ నమ్మకాన్ని హాను రాఘవపూడి వమ్మ చేయలేదు.మొదట ఈ సినిమాని హీరో రామ్ కి వినిపించగా తనకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని కి సైతం కథ వినిపించడంతో ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చి కెరియర్ రిస్క్ లో పెట్టుకోవడం ఇష్టం లేక నో చెప్పేసాడు.
దాంతో ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి వెళ్ళింది.ఏది ఏమైనా రామ్ లేదా నాని లాంటి స్టార్ హీరోలు ఈ సినిమా చేసి ఉంటే వారి కెరియర్ మరొక స్టెప్ పైకెక్కి ఉండేది.
డాకు మహారాజ్ గా వచ్చేస్తున్న బాలయ్య బాబు (వీడియో)