వైఖానసులు ఎవరు ? వీరిని గురించి తెలపండి ?

దేవాలయం అర్చకులలో ఒక తెగకు చెందిన వారు వైఖానసులు.వీరు కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ శాఖకు చెందిన వారు.

వేద విహిత ధర్మం పాటించే వారు.'వైఖానస' శబ్దానికి అనేక విధాల నిర్వచనాలు ఉన్నాయి.

విఖనా వై విష్ణుః తజ్జా వైఖానసాః స్మృతాః.అనగా విఖనుడే విష్ణువు, ఆయన వంశస్థులే వైఖానసులు.

మనస్సును విశేషంగా ఖననం చేసి (తపస్సు చేసి) విష్ణువు సుతుడు (బ్రహ్మ) విఖనుడు అయ్యాడు.

ఆయన మునులలో మొదటి వాడు.విఖనా ఇతిహి ప్రోక్తో మనసః ఖననాత్సుతతః బ్రహ్మణః సు విశేషేణ మునీనాం ప్రథమో మునిః.

అంతర్గమైన వేదాలను త్రవ్వి పైకి తీయడం వల్ల ఆ ప్రభువు విఖనుడు అయ్యాడు.

ఆయనే పితామహుడు వైఖానసుడు.అంతే కాకుండా వాన ప్రస్థుణ్ణి గూడా వైఖానసుడు అంటారు.

ఈ రీతిగా విష్ణువు, బ్రహ్మ, విష్ణు మానస పుత్రుడు, వైఖానస వంశ కర్త, వాన ప్రస్థుడైన ముని అని వైఖానసప దానికి అనేక అర్థాలు చెబుతారు.

కశ్యపుడు, అత్రి, మరీచి, వసిష్ఠుడు, అంగిరసుడు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు ఈ తొమ్మిది మంది విఖనసుని శిష్యులు.

వీరు వైఖానస సంప్రదాయ వ్యాప్తి కల్గించారు.ముక్తికి భక్తి ఒక్కటే చాలదనీ, మూర్తి పూజ కూడ చేయాలనీ వైఖానసులు అంటారు.

వీరు తమ పూజా విధిని వేద మంత్రాలతో నిర్వహిస్తారు.తమిళ ప్రబంధాలకు అందులో స్థానం లేదు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చు కులు వైఖానసులు.