గ్లాసెస్ పెట్టుకుని, స్టైల్ గా సిగరెట్ తాగుతున్న ఈ నటుడు ఎవరో తెలుసా ?

కర్మ సిద్ధాంతం.మనిషిని ఎక్కడికి తీసుకెళ్లి వదిలేస్తుందో ఎవరు చెప్పగలరు.

ఎన్నో ఆశలతో, ఆశయాలతో జీవితం బాగుండాలని కోరుకుంటాం కానీ అన్ని అనుకున్నట్టు జరిగితే ఆ దేవుడు ఎందుకు ? మనుషులే వారికి నచ్చినట్టు హ్యాపీ గా బ్రతికేస్తారు.

ఆలా ఒక్కో సారి కొందరిని చూస్తుంటే ఇలా జరిగి ఉండకుండా ఉంటె బాగుండు అని అనిపిస్తుంది.

అలాంటి ఒక ఒక వ్యక్తి మరియు నటుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఇప్పుడు ఇక్కడ ఫొటోలో కాస్త చబ్బీ గా ఉన్న కూడా స్టైల్ గా నిలబడి, సిగరెట్ కాల్చుతూ కనిపిస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా ? అతడు టాలీవుడ్ లో బ్రతికి చెడ్డ ఒక టాప్ కమెడియన్.

ఇప్పటికి గుర్తు పట్టకపోతే ఆర్టికల్ పూర్తిగా చూడండి.అతడు మరెవరో కాదు.

ఇవివి సత్య నారాయణ సినిమాల ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా నటుడు ఐరెన్ లెగ్ శాస్త్రి.

అసలు పేరు గునుపూడి విశ్వనాధ్ శాస్త్రి.అతడు బ్రహ్మాణుడు కావడం తో సినిమా ఓపెనింగ్స్ కోసం పూజలు , ముహూర్తపు షాట్స్ కి ముహుర్తాలు పెట్టేవాడు.

ఆలా ఒక సారి ఇవివి సత్యనారాయణ కు ఎందుకు నచ్చాడో తెలియదు కానీ అప్పుల అప్పారావు సినిమా కోసం శాస్త్రి ని నటించమని అడిగాడు.

అప్పటికే ఒకటి రెండు సినిమాల్లో అర్చకుడిగా కొన్ని సెకండ్స్ పాటు కనిపించే పాత్రలో నటించాడు.

అప్పుల అప్పారావు సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ లో నటించాడు.ఆ సినిమా తర్వాత ఆయన్ను అందరు ఐరెన్ లెగ్ శాస్త్రి గా పిలవడం మొదలు పెట్టారు.

"""/"/ ఒక వేళా సినిమా ఫంక్షన్స్ పూజ కార్యక్రమాలు చేసుకున్న ఈ రోజు ఇలా మనం మాట్లాడుకునేవాళ్ళం కాదు.

కానీ ఆయనకు సినిమా జీవితం బాగా నచ్చింది.ఐరెన్ లెగ్ శాస్త్రి గా అయన ఫిక్స్ అయిపోయారు.

పాతిక సినిమాల వరకు నటించారు.పౌరోహిత్యం మానేశారు.

నిజ జీవితం లో కూడా ఆయన్ను అందరు ఐరెన్ లెగ్ గా చూడటం తో సినిమాలు పోయాయి.

పౌరోహిత్యం పోయింది.చివరికి చనిపోతే ఇంటికి రిక్షాలో తీసుకోచ్చారట.

ఇంత స్టైల్ గా హీరోల ఉన్న శాస్త్రి ఎంతో దీనమైన స్థితిలో కన్ను మూసాడు.

అయన కుటుంబం ప్రస్తుతం ఎన్నో ఇబ్బందుల్లో ఉంది.మీడియాలో వారి ఇంటర్వూస్ కూడా కనిపిస్తున్నాయి.

ఆ కంచుకోటల్లో ఈసారైనా బోణీ కొడతారా ?