డీఎస్పీ, తమన్ లలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..? తెలిసే సమయం వచ్చిందా..?

ఒక సినిమా సక్సెస్ కావాలంటే అందులో దర్శకుడి పాత్ర ఎంతలా ఉంటుందో మ్యూజిక్ డైరెక్టర్ల పాత్ర కూడా అంతే ఉంటుంది.

ఆ సినిమాకి తగ్గ ఎలివేషన్స్ ఇవ్వడంలో బిజీయం అనేది చాలా వరకు కీలక పాత్ర వహిస్తుంది.

కాబట్టి ఆ సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకుడ్ని మెప్పిస్తే వాటి కోసమైనా సినిమా చూడడానికి వచ్చే జనాలు చాలామంది ఉన్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ప్రస్తుతం తమన్,( Thaman ) దేవి శ్రీ ప్రసాద్( Devisri Prasad ) ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరక్టర్లు గా కొనసాగుతున్నారు.

"""/" / ఇక వీళ్లలో ఎవరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ తన సొంత మ్యూజిక్ తో ముందుకు సాగుతూ ఉంటే తమన్ మాత్రం ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన అది కాపీ మ్యూజిక్ అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఓజీ,( OG ) గేమ్ చేంజర్( Game Changer ) లాంటి సినిమాలతో తమన్ తన మ్యూజిక్ ని సరికొత్తగా పరిచయం చేస్తుంటే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

"""/" / ఈ సినిమాల్లో ఏ సినిమా మ్యూజిక్ అనేది బెస్ట్ గా ఉంటుందో ఆ మ్యూజిక్ డైరెక్టర్ నే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గుర్తించబోతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ సంవత్సరం ఎలాగైనా సరే వీరిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది తెలియబోతుంది.

ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి చాలా సినిమాలకి మ్యూజిక్ ఇస్తున్నప్పటికీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు.

ఇక ఈ సంవత్సరం ఎలాగైనా వీళ్ళ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

UFC: ఒకే ఒక్క పంచ్.. జస్ట్ 19 సెకన్లలోనే.. భారత యోధుడికి ఘోర పరాభవం!