ఆ ముగ్గురిలో ఒకరి కోసం ట్రై చేస్తున్న అజయ్ భూపతి..!

RX 100 మూవీ తో సూపర్ హిట్ కొట్టి యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి.

ఆ తర్వాత శర్వానంద్ , సిద్దార్థ్ లతో మహాసముద్రం మూవీ ని తెరకెక్కించారు.

కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది.దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మంగళవారం అనే మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కబోతుంది అంటున్నారు.అలాగే ఈమూవీలో హారర్ మరియు కామెడీ కూడా ఉంటుందని సమాచారం.

ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా రష్మిక , పూజా హగ్దే , సమంతలను అనుకుంటున్నారట అజయ్.

మరి ఆ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.అలాగే అజయ్ చేసిన రెండు చిత్రాలలో ఇప్పటిదాకా హారర్ కానీ కామెడీ ఎలిమెంట్స్ కానీ లేవు.

మరి రెండు కలిపిన ఈ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.ఇక ఈ మూవీని అజయ్ భూపతి తన స్నేహితులతో కలిసి ప్రొడ్యూస్ చేయనుండగా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి 2023 వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 మహా సముద్రం రిజల్ట్ తేడా కొట్టడంతో అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు.

ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు.

హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?