సలార్ లో పృథ్వి రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా ఇప్పటికే సెట్స్ మీద చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రభాస్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

ఇక వాటిలో ముఖ్యంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.

కేజీఎఫ్ మూవీతో త‌న స‌త్తా ఏంటో చూపించిన స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

రెండు భాగాలు స‌లార్ రాబోతోంది.మొద‌టి భాగాన్ని `సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌` టైటిల్ తో విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.పృథ్వీరాజ్ సుకుమారన్, జ‌గ‌ప‌తి బాబు, టినా ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్ తో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

ప్ర‌భాస్ గ‌త చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డిన‌ప్ప‌టికీ.స‌లార్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

"""/" / గురువారం ఉద‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్ తో ఆ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

టీజ‌ర్ లో ప్ర‌భాస్ ఫేస్ ను చూపించ‌నందుకు ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినా.

ఆయ‌న‌ క్యారెక్ట‌ర్ ను జురాసిక్ పార్క్ లో డైనోసర్ తో కంపేర్ చేస్తూ ఇచ్చిన ఇంట్రెడ‌క్ష‌న్ ఫుల్ కిక్ ఇచ్చింది.

అయితే ఈ టీజ‌ర్ చివ‌ర్లో క‌న్న‌డ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ను కూడా చూపించారు.

ఈ సినిమాలో ప్రభాస్ తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం గ్యాంగ్ స్టర్ గా మారుతాడు.

సినిమా మొత్తం స్నేహం కోసమే యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది.అయితే ప్ర‌భాస్ స్నేహితుడి పాత్ర‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ క‌నిపిస్తాడా.

లేక మ‌రేదైనా నెగ‌టివ్ రూల్ ను పోషిస్తున్నాడా.? అన్న‌ది స‌స్పెన్స్‌.

"""/" / కానీ, ఆయ‌న పాత్ర మాత్రం సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుంది.

అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.స‌లార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ముఖ్య‌మైన పాత్ర కోసం మొద‌ట ప్ర‌భాస్.

హీరో గోపీచంద్( Gopi Chand ) ని తీసుకుందామని చెప్పాడట.ఇక ఆల్రెడీ వీరి కాంబోలో వర్షం సినిమా వచ్చింది.

ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.ఈ నేప‌థ్యంలోనే ప్రభాస్ గోపిచంద్ ని తీసుకొమ్మని చెప్పాడు.

ప్రభాస్ నిర్ణయానికి ప్ర‌శాంత్ నీల్ నో చెప్పార‌ట‌.ఎందుకంటే గోపిచంద్ అయితే ఇద్దరు తెలుగు వాళ్లే అయిపోతారు కాబట్టి మనకు మార్కెట్ వర్కర్ అవ్వదు అని చెప్పడం తో ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడట.

ఇక ఫైన‌ల్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేశార‌ట‌.అలా అనుకోకుండానే స‌లార్ మూవీలో గోపీచంద్ చేయాల్సిన పాత్ర ని పృథ్వీరాజ్ సుకుమారన్ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది.