ఆచార్య ప్లాప్ కి కారణం ఎవరు..? ఎవరిని ఉద్దేశించి కొరటాల కామెంట్లు చేశాడు…
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం 'విశ్వంభర ' సినిమాతో( Vishwambhara ) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మ్యాజిక్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే విశ్వంభర మూవీ దర్శకుడు అయిన వశిష్ట మాత్రం ఈ సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇంతకుముందు కొరటాల శివతో( Koratala Siva ) చేసిన 'ఆచార్య' సినిమా( Acharya ) ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు.
దాంతో చిరంజీవి గారే ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు అంటూ కొంతమంది కొన్ని విమర్శలైతే చేశారు.
"""/" /
కొరటాల శివ ఆ సినిమాకు దర్శకత్వం వహించినప్పటికీ చిరంజీవి ఇన్ పుట్స్ ఎక్కువవ్వడం వల్లే ఈ సినిమా ప్లాప్ అయిందంటూ ఆయన ఇన్ డైరెక్టుగా కొన్ని కామెంట్లైతే చేశాడు.
ఇక రీసెంట్ గా కూడా ఆయన చేసిన కామెంట్ల పట్ల ప్రేక్షకులతో పాటు చిరంజీవి అభిమానులు కూడా చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు.
మరి మొత్తానికైతే దేవర సినిమాని( Devara ) సూపర్ సక్సెస్ గా నిలిపిన కొరటాల ఆచార్య సినిమాను మాత్రం సక్సెస్ ఫుల్ గా నిలపడంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.
"""/" /
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ చెప్పినట్టుగానే చిరంజీవి ఇన్ పుట్స్ ఎక్కువ అయ్యాయని రామ్ చరణ్( Ram Charan ) క్యారెక్టర్ ను పెంచమని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది.
దాని వల్లే సినిమా కథ ఎటు కాకుండా పోయిందని దానికి కొరటాల కూడా ఎలాంటి బాధ్యత వహించలేకపోయాడనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరి ఆచార్య సినిమా ఫ్లాప్ వెనుక కొరటాల హస్తము ఉందా? లేదంటే చిరంజీవి ఇన్ పుట్స్ ఇవ్వడం వల్లే ఫ్లాప్ అయిందా అనేదానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా మీద చాలా చర్చలైతే జరుగుతున్నాయి.
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..