విజయ్ దేవరకొండ నానిలలో నంబర్ వన్ ఎవరు.. ఆ సర్వేతో పూర్తి క్లారిటీ .!
TeluguStop.com
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ), నానిలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్, గుర్తింపు ఉంది.
విజయ్ దేవరకొండ, నానిలలో నంబర్ వన్ ఎవరు అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండగా ఆ ప్రశ్నకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది.
తాజాగా విడుదలైన ఒక సర్వే ఫలితాల ప్రకారం విజయ్ దేవరకొండ నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం.
వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నా విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
ఈ సర్వే ఫలితాలలో రామ్ పోతినేని మూడో స్థానంలో నిలవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
నాగచైతన్య( Naga Chaitanya ) నాలుగో స్థానంలో సాయితేజ్ ఐదో స్థానంలో నిఖిల్ ఆరో స్థానంలో నిలిచారు.
మిడిల్ రేంజ్ హీరోలలో చాలామంది వరుస విజయాలు సాధిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
"""/"/నవీన్ పోలిశెట్టి, అడివి శేష్, శర్వానంద్, వరుణ్ తేజ్ తర్వాత స్థానాలలో నిలిచారు.
కొంతమంది మిడిల్ రేంజ్ హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.విజయ్ దేవరకొండ గత సినిమా ఫ్యామిలీ స్టార్( Family Star ) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.
"""/"/
నాని కెరీర్ విషయానికి వస్తే సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) సినిమాతో బిజీగా ఉన్నారు.
నాని రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.నాని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించగా ఆ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో తెలియాల్సి ఉంది.
నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.వరుస విజయాలు నానికి కెరీర్ పరంగా ఎంతగానో ప్లస్ అవుతుండటం గమనార్హం.
రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టట్లేదా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!