హూ ఈజ్ ” కింగ్ మేకర్ ” !

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్నాటక ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి.ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.

అయినప్పటికి కన్నడనాట అధికారంలోకి వచ్చే పార్టీపై ఇంకా సంధిగ్ధత కొనసాగుతూనే ఉంది.సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ లోని రిజల్ట్స్ ను బట్టి అధికారంలోకి వచ్చే అంచనా వేయడం సహజం.

కానీ కర్నాటక ఎన్నికలు ఇందుకు బిన్నంగా కనిపిస్తున్నాయి.మొదటి నుంచి త్రిముఖపోరు కనిపించిన కర్నాటకలో ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారాన్ని త్రిముఖంగానే కట్టబెట్టాయి.

కొన్నిసర్వేలు కాంగ్రెస్( Congress ) కు అధికారాన్ని కట్టబెడితే మరికొన్ని బీజేపీకి అధికారాన్ని ఇచ్చాయి.

ఇంకొన్ని హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని తేల్చి చెబుతున్నాయి.అయితే మెజారిటీ పోల్స్ హంగ్ వైపే మొగ్గు చూపాయి.

"""/" / దాంతో ఒకవేళ హంగ్ ఏర్పడితే.కన్నడ నాట కింగ్ మేకర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.

224 సీట్లు ఉన్న కర్నాటక( Karnataka Election )లో మేజిక్ ఫిగర్ 113 సీట్లు కైవసం చేసుకున్నా పార్టీ నిరభ్యంతరంగా ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు.

కానీ ప్రస్తుతం కర్నాటకలో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు కావడం చేసుకోలేవని పోల్స్ తేల్చి చెబుతున్నాయి.

కాంగ్రెస్ కు 90-110 సీట్లు బీజేపీ కి 80-105 సీట్లు జెడిఎస్ కు 20-40 స్థానాలు ఇలా రకరకాలు గా సర్వేలు చెబుతున్నాయి.

ఒకవేళ హంగ్ ఏర్పడితే 2018 ఎన్నికల మాదిరి జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది.

"""/" / దాంతో మరోసారి సి‌ఎం పదవి కుమారస్వామిని వరించిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.

ఎందుకంటే 2018లో కాంగ్రెస్ కు 80 సీట్లు సాధించినప్పటికి, 37 సీట్లు సాధించిన జేడీఎస్ తరుపున కుమారస్వామి( Kumaraswamy ) సి‌ఎం పదవి చేపట్టారు.

ఆ లెక్కన చూస్తే 2018 సీన్ రిపీట్ అయిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.

కాగా హంగ్ ఏర్పడితే కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదని జేడీఎస్ ఇప్పటికే తేల్చి చెబుతోంది.

ఆ లెక్కన చూస్తే జేడీఎస్ బీజేపీతో చేతులు కలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

మరి బీజేపీలో కూడా రాజకీయ ఉద్దండులు చాలానే ఉన్నారు.మరి వారీనందరిని కాదని జేడీఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

కానీ హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర కచ్చితంగా జేడీఎస్ పార్టీ పోషించే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..