లీకేజ్ గోల.. ఎవరిది హైడ్రామా !
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రతి అంశం కూడా రాజకీయ రగడకు దారి తీస్తోంది.
ఇక తాజాగా రాష్ట్రంలో ప్రశ్నపాత్రల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది.ఆ మద్య టిఎస్పిఎస్సి( TSPSC ) ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం ముగియక ముందే తాజాగా పదవ తరగతి వార్షిక పరీక్ష ప్రశ్నపాత్రలు ఎక్జామ్ కంటే ముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తుండడంతో రాష్ట్రాన్ని ఈ వ్యవహారం కుదిపేస్తోంది.
విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ ఇష్యూను ప్రజలు కూడా తేలికగా తీసుకోవడం లేదు.
అయితే ఇలా ప్రశ్నపత్రాల లీకేజ్( Leakage Of Question Papers ) వెనుక రాజకీయ వ్యూహాలు సాగుతున్నాయనేది కొందరి అభిప్రాయం.
"""/" / వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసిఆర్( KCR ) ను గద్దె దించాలని చూస్తున్న బీజేపీ( BJP ).
అస్త్రశాస్త్రాలతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే కేసిఆర్ అసమర్థ పాలన వల్ల ప్రశ్న పాత్రలు లీకేజ్ అవుతున్నాయని, ఇలాంటి పాలన తెలంగాణ ప్రజలకు అవసరం లేదని విమర్శలు ఎక్కుబెట్టారు కమలనాథులు.
అయితే అయితే ఇలా ప్రశ్నపత్రాల లీకేజ్ వెనుక కమలం పార్టీ నేతల హస్తం ఉందనేది బిఆర్‌ఎస్( BRS ) నుంచి వినిపిస్తున్న వాదన.
కేసిఆర్ ప్రభుత్వంపై బురద చళ్ళేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కు బీజేపీ నేతలు తెరతీశారని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
"""/" /
ఇలా వాడివేడిగా సాగుతున్న ఈ రాజకీయ రగడలో తాజాగా బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay ) ని అరెస్ట్ చేశారు పోలీసులు.
దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది.ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక బండి సంజయ్ హస్తం ఉందనే ఆరోపణలతోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కేవలం బండి సంజయ్ ని మాత్రమే కాకుండా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే కేవలం కేసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే బండి సంజయ మరియు రఘునందన్ రావు ( Raghunandan Rao )లను అరెస్ట్ చేశారని, ఇదంతా కేసిఆర్ కక్ష పూరిత రాజకీయం అని కమలం పార్టీ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన వ్యవహారం కాస్త.రాజకీయ రంగు పులుముకొని హైడ్రామాకు తెరలేచింది.
మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
అక్క అంటే నీకేంటి ప్రాబ్లమ్.. యష్మీకి నాగార్జున భారీ షాకిచ్చాడుగా!