సంపంగి సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం కామన్ గా జరుగుతూ ఉంటుంది.

అయితే అలాంటిది సంపంగి సినిమా విషయం లో కూడా ఇలానే జరిగింది.ఇక అసలు విషయం లోకి వెళ్తే దీపక్ హీరోగా డైరెక్టర్ సన యాదిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సినిమా సంపంగి( Sampangi ) ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.

ఈ సినిమాతోనే దీపక్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. """/" / అయితే ఈ సినిమా లో ముందు హీరో గా దీపక్ ని కాకుండా వేరే హీరో ను అడిగినట్లుగా తెలుస్తుంది.

ఆయన ఎవరు అంటే అప్పటికే నువ్వే కావాలి అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన తరుణ్( Tarun ) ని ఈ సినిమా చేయమని అడిగినట్లుగా తెలుస్తుంది.

కానీ ఆయన అప్పటికే చాలా సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఈ సినిమా చేయకుండా వదిలేశాడు.

కానీ ఆ తర్వాత ఈ సినిమా మిస్ చేసుకున్నానని చాలా బాధపడ్డడు.తరుణ్ ఈ సినిమా చేసి ఉంటే నిజంగా ఆయనకి ఒక మంచి హిట్ పడేది అందుకే సినిమాల ఎంపిక విషయం లో హీరోలు కొంచం జాగ్రత్తగా ఉండాలని అందరూ చెప్తూ ఉంటారు ఒక హిట్ సినిమా మిస్ అయిన కూడా వాళ్ళు చాలా మిస్ అయిపోయినట్టే.

"""/" / ప్రస్తుతం తరుణ్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు అనే చెప్పాలి.

దీపక్ కూడా ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అన్నీ ప్లాప్ అవ్వడంతో ఆయనకి కూడా హీరోగా కెరియర్ అనేది ముగిసిపోయింది అనే చెప్పాలి.

దాంతో కొన్ని సినిమాల్లో ఆయన సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు అనే చెప్పాలి.

అందులో భాగంగానే కింగ్ భద్ర అరుంధతి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

జై బాలయ్య అంటూ రియాక్ట్ అయిన పూనమ్.. త్రివిక్రమ్ కు మాత్రం మరో షాకిచ్చిందిగా!